మొక్కల పెంపకం వేగవంతం చేయాలి మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి

జగిత్యాల ముచ్చట్లు :

హరితహారం కార్యక్రమంలో భాగంగా నర్సరీల్లో చేపట్టిన మొక్కల పెంపకాన్ని వేగవంతం చేయాలని జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ డా.భోగ శ్రావణి  అధికారులను ఆదేశించారు.
బుధవారం పట్టణంలోన 9వ వార్డు అచ్చబండ పోచమ్మ వద్ద,ధరూర్ క్యాంప్, మాత శిశు  కేంద్రం వద్ద మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలను కౌన్సిలర్ తో కలిసి మున్సిపల్ ఛైర్ పర్సన్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఛైర్ పర్సన్ మాట్లాడుతూ మన జగిత్యాల ను హరిత జగిత్యాల గా ఏర్పాటు చేసే దిశగా నర్సరీలు ఏర్పాటు చేశామని, అందులో భాగంగా 13 నర్సరీలను 10 లక్షల మొక్కల సామర్థ్యం గల నర్సరీలు మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామన్నారు. రానున్న హరితహారం కార్యక్రమం కోసం ముందస్తుగా ఉపయోగపడే మొక్కలను పెంచాలని సూచించారు.. మొక్కల పెంపకంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని,  పట్టణ ప్రజలకు ఉపయోగపడే మొక్కల పెంపకంలో ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో  కౌన్సిలర్ వొద్ది శ్రీలత రామ్మోహన్, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు..

 

భర్తను కొట్టి చంపిన భార్య

Tags:Plant breeding should be accelerated
Municipal Chairperson Bhoga Shravani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *