శ్రీశైలంలో భక్తులకు మొక్కుల కష్టాలు

శ్రీశైలం ముచ్చట్లు:

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు ఎవరిగుండు వారే గీసుకుంటున్నారు శ్రీశైలంలోని తలనీలాల కళ్యాణకట్ట గత నెల రోజులుగా మూత పడింది కళ్యాణకట్టలో విధులు నిర్వహించే ఉద్యోగులకు కొందరికి కరోన పాజిటివ్ వచ్చింది దీనితో దేవస్థానం అధికారులు గత నెల రోజులుగా కళ్యాణకట్ట తాత్కాలికంగా మూసివేశారు స్వామివారికి తలనీలాలు ఇచ్చేందుకు శ్రీశైలం మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులెదుర్కుంటున్నారు మల్లికార్జున స్వామివారికి తలనీలాలు ఇస్తామని మొక్కులు మొక్కుకున్న భక్తులు శ్రీశైలం వచ్చి మొక్కులు తీర్చుకునేందుకు వీలు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మొక్కులు తీర్చుకోకుండా వెళ్లలేక శ్రీశైలంలోని కళ్యాణకట్ట వద్దే సందులలో భక్తులు ఒకరి గుండు మరోకరు గీసుకుంటూ ఒకరికోకరు సహకరించుకుంటూ భక్తులు గుండ్లు గీసుకుంటూ అష్టకష్టాలు పడుతున్నారు తలనీలాలు ఇచ్చే క్రమంలో గుండ్లు గీసుకోవడం తెలియక తలకు గాట్లు పెట్టుకుంటు ఇబ్బందులు పడుతూ భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. దేవస్థానం అధికారులు కళ్యాణకట్ట తెరిచి ఉంటే భక్తుల మొక్కులు తీర్చుకునేందుకు వీలుగా ఉండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:Plant difficulties for devotees in Srisailam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *