Plant plants and protect the environment

మొక్కలు నాటండి పర్యావరణాన్ని కాపాడండి

-ఎం.వి.రావు.ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ

Date:13/08/2020

నెల్లూరు  ముచ్చట్లు:

మొక్కలు నాటండి తద్వారా… పర్యావరణాన్ని కాపాడుకుందామని ఎం వి రావ్ పౌండేషన్ మరియు శంకర్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు ముప్పవరపు ఆదిలక్ష్మి కోరారు.గురువారం కోట మండలం చెందోడు గ్రామంలో విద్యా ప్రదాత శ్రీ విద్యా వికాస్ ఎడ్యుకేషనల్ సొసైటీ మాజీ కార్యవర్గ సభ్యులు ముప్పవరపు వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం ఆయన పేరిట ఏర్పాటుచేసిన ఎం.వి.రావు.ఫౌండేషన్ మరియు శంకర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు రాష్ట్రాన్ని పర్యావరణ రహిత రాజ్యం గా తీర్చి దిద్దాలన్న ఆశయం మేరకు అందులో భాగంగా ఎం.వి.రావు.ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో మొక్కలు నాటించారు.ప్రతి ఇంటికి ఒక పూల మొక్క వంతున మహిళలకు ఫౌండేషన్ నిర్వాహకులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎం.వి.రావు.ఫౌండేషన్ ఛైర్మెన్ ముప్పవరపు. లీలా.మోహన్.కృష్ణ.ఎం.విజయలక్ష్మి. మాలికార్జునరావు,పుట్టయ్య,ఉష తదితరులు పాల్గొన్నారు.

లబ్ధిదారులకు వైయస్సార్ చేయూత  ఫారాలను అందజేసిన చేజర్ల మహేష్

Tags: Plant plants and protect the environment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *