మొక్కల సంరక్షణ కుడా ముఖ్యమే

Plant protection is also important

Plant protection is also important

Date:23/11/2018
కామవరపుకోట ముచ్చట్లు:
మొక్కలు నాటడమే కాదు వాటి వృక్షాలుగా ఎదిగేవరకు సంరక్షించినప్పుడే వనం –మనం కార్యక్రమానికి  సార్దరత చేకూరుతుందని జిల్లా కలెక్టర్ డా.కాటంనేని భస్కర్ చెప్పారు.  శుక్రవారం నాడు  వనం-మనం కార్యక్రమంలో కార్తీక వన మహోత్సవం కార్యక్రమంలో చితలపూడి శాసనసభ్యురాలు పీతల సుజాత లో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లడుతూ ప్రకృతికి మనిషి చేస్తున్న వినాశనాన్ని గుర్తెరిగిన మన పూర్వికులు ప్రకృతికి మనిషిని దగ్గర చేసేందుకు కార్తీక వన సమారాధన చేసే వారన్నారు. ప్రతీ ఒక్కరూ చెట్లను నాటి వాటిని పరిరక్షించనప్పడే భావి తరాలకు కాలుష్యరహిత పర్యావరణాన్ని అందించవచ్చన్నారు. చెట్లు నీడను ఇవ్వడమే కాక మనుషులకు ప్రాణ వాయువును అందిసాయని, కావున ప్రతీ ఒక్కరూ వారి శుభకార్యాల సమాయంలో ఒక మొక్కను నాటడం అభిరుచిగా చేసుకుని నాటిన మొక్కను పరిరక్షించాలన్నారు. గత 20 సంవత్సరాల నుండి జిల్లాలో మొక్కలను నాటుతున్నామని ఎన్ని మొక్కలు నాటామె అన్నాది ముఖ్యం కాదని, ఎన్ని మొక్కలను సంరక్షిచామన్నదే ముఖ్యమన్నారు.
గత సంవత్సరం జిల్లాలో రోడ్లకు ఇరువైపులా 25 లక్షల మొక్కలను నాటి ,వాటి సంరక్షణకు ట్రీ గార్డులు ఏర్పాటుచేశామన్నారు.  చింతలపూడి శాసనసభ్యురాలు పీతల సుజాత మాట్లాడుతూ భూమి మీద అడవులు అంతరించిపోతున్నాయని, దీనికారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతింలున్నదన్నారు. ఈ సమస్య గుర్తిచిన రాష్ట్ర ప్రభుత్వం వనం-మనం కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున మొక్కలను పెంచుతున్నామన్నారు. సమారాధనలో వనాలలో గడపడం ప్రశాంత  చేకూరుస్తుందన్నారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లని, ప్రకృతిని మనం  నిర్లక్ష్యం చేస్తే భావితరాలకు తీరని ముప్పును చేసినవారమవుతీమన్నారు. కార్యక్రమంలో డియఫ్ వో శ్రీనివాసరావు, యం.పి.పి సుబ్బలక్ష్మి , ఘంటా సుధీర్ బాబు చ యంపిడినో మనోజ్, ప్రభృతులు పాల్గొన్నారు. కార్యక్రమంలో తాము నాటిన మొక్కలను జిల్లా కలెక్టర్ డా. భాస్కర్ ,పీతల సుజాత పరిశీలిచారు.
Tags:Plant protection is also important

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *