మొక్కలు నాటడం సామాజిక బాధ్యత

గడివేముల ముచ్చట్లు:

మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవడం సామాజిక బాధ్యత అని ఎంపీడీవో విజయసింహారెడ్డి అన్నారు. మండలంలోని అన్ని పంచాయతీలకు జిందాల్ పరిశ్రమ ఆధ్వర్యంలో 1.200 మొక్కలను పంపిణీ చేశారు. ఎంపీడీవో మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మొక్కలు నాటడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. మొక్కలు నాటి అవి వృక్షాలుగా ఎదిగే వరకు సంరక్షించుకోవాలని కోరారు. ఈవోఆర్డి అబ్దుల్ కలిక్, సిబ్బంది భాస్కర్, విజయలక్ష్మి పాల్గొన్నారు.

 

Tags: Planting trees is a social responsibility

Leave A Reply

Your email address will not be published.