పుంగనూరులో మొక్కలు నాటి హరితవనంగా మార్చాలి – ఎంపి రెడ్డెప్ప

పుంగనూరు ముచ్చట్లు:

 

అన్ని ప్రాంతాల్లోను మొక్కలు నాటి పుంగనూరును హరిత పట్టణంగా మార్చేందుకు ప్రతి ఒక్కరు భాగస్వామ్యులుకావాలని చిత్తూరు ఎంపి రెడ్డెప్ప పిలుపునిచ్చారు. బుధవారం కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఎంపి రెడ్డెప్ప, చైర్మన్‌ అలీమ్‌బాషా హాజరై బైపాస్‌రోడ్డులో మొక్కలు నాటి, ట్రిగార్డులు ఏర్పాటు చేశారు. ఎంపి మాట్లాడుతూ డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపు మేరకు స్వచ్చ సంకల్పంతో పచ్చదనాన్ని పెంపొందించి , పారిశుద్ధ్య కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహించేందుకు భాగస్వామ్యులుకావాలన్నారు. పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు మొక్కలు నాటి, వాటిని బతికించాలని కోరారు. ఖాళీ ప్రాంతాలలో, రోడ్లకు ఇరువైపులా, ప్రతి ఇంటి వద్ద ఒకొక్కరు ఒకొక్కమొక్క  నాటినా పుంగనూరు హరితవనం అవుతుందని తెలిపారు. ప్రస్తుతం పదివేల మొక్కలను పట్టణంలో నాటి స్వచ్చ పుంగనూరుగా మార్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ నాగేంద్ర, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ నాగభూషణం, కౌన్సిలర్లు నరసింహులు, ఆదిలక్ష్మి, మనోహర్‌, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు శ్రీనివాసులు పాల్గొన్నారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags: Plants in Punganur should be greened – MP Reddeppa

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *