116 నర్సరీల్లో మొక్కలు కోటి మొక్కలు

Plants of crops in 116 nurseries

Plants of crops in 116 nurseries

Date:13/07/2018
నిజామాబాద్ ముచ్చట్లు:
వేసవి కాలంలో ఎండలు ప్రతాపం చూపించాయి. ఉష్ణ తాపాన్ని చవిచూసిన ప్రజలంతా వేడి నుంచి ఉపశమనాన్ని కోరుకున్నారు. . తొలకరి వర్షాలు కురి సే నాటికి మొక్కలు సరఫరా చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఈసారి పెంచుతున్న మొత్తం మొక్కల్లో సగం వరకు టేకు మొక్కలు ఉండే అ వకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి నేటి వరకు మొత్తం నాలుగు విడతలుగా హరితహా రం కార్యక్రమాలు సాగాయి. కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు సుమారుగా నాలుగు కోట్ల మొక్కలు నాటారు. మొదటి విడతలో 1.20కోట్లు మొక్కలు, రెండో విడతలో 1.50 కోట్లు, మూడో విడతలో 1.85 కోట్లు మొక్కలు నాటారు. ప్రస్తుతం నాలుగో విడతలో 1.30 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.ఎండా కాలం ఎలా గడుస్తుందో అంటూ ఉక్కిరిబిక్కిరయ్యారు. అయితే, ఎండాకాలం పోయిందని సంబరపడినా ఇప్పుడదీ తా త్కాలికమే. ఎందుకంటే భవిష్యత్తులోనూ అధిక ఉష్ణోగ్రతల ప్ర భావం తీవ్ర స్థాయిలో ఉంటుందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రభావం పడకుండా ఉండాలంటే మొక్కలు నాటి వాటిని వృ క్షాలుగా ఎదిగే వరకు సంరక్షించాలి. జిల్లాలో 800 చదరపు కిలో మీటర్ల మేర అడవి విస్తరించి ఉంది. కాకపోతే ఇప్పుడిదంతా రికార్డుల్లోనే కనపిస్తోంది. అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం మూలంగా చాలా చోట్ల అడవి గొడ్డలి వేటుకు బలవుతోంది. పచ్చదనం కాస్తా కనుమరుగై మైదానాలను తలపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం ప్రకారం పచ్చదనాన్ని 33 శాతానికి చేరాలంటే జిల్లాలో ప్రతి ఒక్కరూ 20 మొక్కలు నాటాలి. వరుణుడు వర్షించే వేళ మొక్కలను నాటేందుకు సరైన సమయం. జిల్లాలోని గ్రామా లు, పట్టణాల్లో చైతన్యవంతులైన ప్రజలు మొక్కలు నాటే హరితయజ్ఞంలో భాగస్వాములైతే హరిత సంకల్పం నెరవేరినట్లేనని అధికారులు భావిస్తున్నారు.జిల్లాలో నాలుగో విడత హరితహారం కార్యక్రమానికి అధికార యంత్రాంగం సిద్ధమైంది. జిల్లాలో ని 323 గ్రామ పంచాయతీలు, రెండు పురపాలక సంఘాలు, ఒక నగర పంచాయతీ పరిధిలో మొక్కలు నాటనున్నారు. జిల్లాలోని 116 నర్సరీల్లో మొక్కలు పెంచారు. టేకు మొక్కలతో పాటు వివిధ రకాల పూ లు, పండ్ల మొక్కలు, యూకలిప్టస్, కాను గ, వేప, జామాయిల్ తదితర రకాల మొక్కలు కొద్ది రోజుల్లోనే నాటేందుకు సిద్ధం కా నున్నాయి. మూడో విడత హరితహారం కార్యక్రమం లో 1.85 కోట్ల మొక్కలు నాటారు. వీటిలో 50 శాతం మొక్క లు జీవం పోసుకున్నాయని అధికారులు చెబుతున్నారు. నాటిన మొక్క ల్లో 95 శాతం మొక్కలకు జియో ట్యాగింగ్ చేశారు. కానీ, క్షేత్ర స్థాయిలో మాత్రం 50 శాతానికి మించి మొక్కలు బతకలేదన్న ది వాస్తవం. గత హరితహారంలో మొక్కలు నాటడంలో కొన్ని శాఖలు విఫలం అయ్యాయనే ఆరోపణలున్నాయి. నాటిన మొక్కలను బతికించుకునేందుకు ప్రభు త్వం ఈసారి ప్రత్యేకంగా దృష్టి సారించింది. వానలు సంవృద్ధిగా కురిసే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో నాటిన మొక్కలకు జీవం పోసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. కామారెడ్డి జిల్లా అంటే ఒకప్పు డు సువిశాల అటవీ ప్రాంతం ఇప్పుడు కాస్తా అడవి హరించుకుపోవడంతో వర్షాలు లేక ఏటా అక్కడక్క డ అల్ప వర్షాపాతం సైతం నమోదు అవుతోంది. అటవీ సంపదను పునరుద్ధరించి ఇలాంటి పరిస్థితులను అధిగమించడానికి ప్రభుత్వం తెలంగాణకు హరితహారం పథకాన్ని అమలు చేస్తోంది. ఏటా లక్షలాది మొక్కలను నాటుతూ పల్లెల్లో పచ్చదనం వెల్లివిరిసేలా చూస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు దాదాపుగా నాలుగు కోట్ల మొక్కలు నాటారు. ఈసారి వ ర్షాలు అంచనాలకు తగ్గట్లుగా కురిస్తే నాటిన మొక్క ల్లో 70నుంచి 80శాతం మొక్కలు బతికే వీలుంది. ఈసారి భారీగా మొక్కలు నాటేందుకు నర్సరీల్లో మొక్కల పెంపకాన్ని ప్రభుత్వం భారీగా చేపట్టింది.స్వచ్ఛ భారత్ స్వచ్ఛ బిచ్కుంద పేరిట భూమి ఫౌండేషన్ చేపట్టిన ప్రతీ ఆదివారం పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఆదివారం ఈ సంస్థ సర్కారు దవాఖాన ఆవరణలో పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. పిచ్చిమొక్కలు, ముళ్ల పొదాలు, చెత్తాచెదారం తొలగించి మొక్కలు నాటారు. కొ న్ని నెలలుగా భూమి ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ప్రతీ ఆదివారం ఒక్కో ప్రాంతాన్ని ఎంచుకొని పరిసరాల శుభ్రత కార్యక్రమం నిర్వహిస్తూ ముం దుకు సాగుతుంది.
116 నర్సరీల్లో మొక్కలు కోటి మొక్కలుhttps://www.telugumuchatlu.com/plants-of-crops-in-116-nurseries/
Tags; Plants of crops in 116 nurseries

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *