మొక్కలు నాటాలి..వాటిని సంరక్షించాలి
కాకినాడ ముచ్చట్లు;
భవిష్యత్ తరాలకు చక్కటి పర్యావరణం అందించాలంటే ప్రతి ఒక్కరు తమ చుట్టుప్రక్కల ప్రాంతాలలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ పిలుపునిచ్చారు. కాకినాడ సినిమారోడ్ లో గల సూర్యకళామందిరంలో ఎ.పి. పోల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ధరిత్రి రక్షిత సమితి సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ధరిత్రి రక్షిత సమితి అద్యక్షురాలు సురేఖ అధ్యక్షత వహించగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ ముఖ్యఅతిధిగాను అడిషినల్ కమిషనర్ నాగనరసింహ్మరావు విశిష్ట అతిధిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా జె.సి. ఇలక్కియ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవలసిన బాద్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. అడిషినల్ కమిషనర్ నాగనరసింహరావు మాట్లాడుతూ కాకినాడ పరిసర ప్రాంతాలలో పెద్ద ఎత్తు న మొక్కలు నాటే కార్యక్రమాలను చేపడుతున్నాట్లు వెల్లడించారు. ఈకార్యక్ర మంలో ఎ.పి. పోల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇ.ఇ. అశోక్ కుమార్, ధరిత్రి రక్షిత సమిటీ సెక్రటరీ నరసింగరావు, వైస్ ప్రెసిడెంట్ పోలిశెట్టి ఈశ్వరరావు, ట్రెజరర్ మురళీకృష్ణ, బాబీ, వివిద కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Tags:Plants should be planted..they should be protected

