మొక్కలను కంటి పాపలా కాపాడుకోవాలి

విలీనమైన గ్రామాల స్వరూపం మారుతోంది
మున్సిపల్ ఛైర్ పర్సన్ భోగ శ్రావణి

జగిత్యాల ముచ్చట్లు:
మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల స్వరూపాన్ని మార్చి, పట్టణ వాతావరణం కల్పించేలా కృషి చేస్తున్నామని జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్   భోగ శ్రావణి అన్నారు. పట్టణంలో మూడవ విడత పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగ రెండవ రోజైన   శుక్రవారం స్పెషల్ డ్రైవ్లో మున్సిపల్ ఆధ్వర్యంలో 2,5,10,29,48 వార్డు లలో  కౌన్సిలర్లు తో కలిసి మొక్కలు నాటి  మున్సిపల్ ఛైర్ పర్సన్ బోగశ్రావణి ఇంటింటికి మొక్కలు పంపిణి చేశారు.ఈ సందర్భంగా భోగ శ్రావణి మాట్లాడుతూ పచ్చని చెట్లే ప్రగతి  మెట్లుగా మారుతాయని, మొక్కలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని వార్డు ప్రజలకు సూచించారు.
2,5,10,29,48 ప్రతి వార్డులో మొక్కలను నాటి వార్డులోని ప్రజలకు ప్రతి ఇంటికి 6 రకాల మొక్కలను పంపిణీ చేశారు.   మున్సిపల్ పరిధిలో మొత్తంలో 10లక్షల మొక్కలు నర్సరీలో  అందుబాటులో ఉన్నాయని l,  ప్రతి ఇంటికి వివిధ రకాల 6 మొక్కలను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామాలు పట్టణానికి దగ్గరగా ఉన్నాయని, అభివృద్ధి అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పారు. గతంలో లింగపెట్ గ్రామంగా ఉండేదని ఇప్పుడు పట్టణాల్లో కలిసిపోయి అభివృద్ధి లో దిశలో తీసుకువెళ్లేందుకు కృషిచేస్తున్నామని  చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాకనే విలీన గ్రామాలు అభివృద్ధి చెందాయని శ్రావణి తెలిపారు. గ్రామంలో ఒకప్పుడు మురికి కాలువలు సరిగా ఉండేవికావని ఇప్పుడు పట్టణ మున్సిపాలిటీలో విలినమైన అనంతరం డ్రైనేజీలు, మురికి కాలువలు, దోమలను నివారించేందుకు ఉపయోగించాల్సిన ఫాగింగ్‌ మిషన్లు, దోమల నియం త్రణకు అవసరమైన కెమికల్స్‌, ఇతరత్రా యంత్రాలు ఉపయోగిస్తామని, విలినమైన గ్రామ పంచాయతీకి పారిశుధ్యం డ్రైనేజీల శుభ్రత, స్వచ్ఛ గ్రామం వైపు అడుగులు వేసేలా ప్రభుత్వం పట్టణ ప్రగతి కింద ప్రత్యేక నిధులను విడుదల చేస్తుందన్నారు.
పలు విధుల్లో  విద్యుత్ దీపాలు లేని దగ్గర ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందన్నారు.
విలినమైన గ్రామంలో వీధులన్నీ అద్దంలా మెరుతున్నాయని, మురుగు కాల్వలన్నీ మెరుగు పడుతున్నాయని, అపరిష్కృత సమస్యలన్నీ తీరి అభివృద్ధి బాట పడుతున్నాయని చైర్పర్సన్ శ్రావణి అన్నారు. పట్టణంలో విలీనమైన గ్రామాలు అభివృద్ధి వైపు నడుస్తున్నాయని ఒక్కప్పుడు గ్రామ పంచాయతీలో ఉన్నపుడు తక్కువ నిధులు మంజూరయ్యేవని,  మున్సిపల్ లో విలినమైన అనంతరం ఎక్కువ నిధులు మంజూరు చేసి  అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.ప్రతి వార్డులో హరితహరం కార్యక్రమంలొ వార్డు కౌన్సిలర్ కథానాయకుడుగా వ్యవహరించి పట్టణ ప్రగతి,  హరితహారం విజయవంతమయితేనే పట్టణాలు  పచ్చగా మారుతాయన్నారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ మారుతీ ప్రసాద్,  వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,   కౌన్సిలర్లు బద్దం లత జగన్, గుగ్గిళ్ల హరీష్, సిరికొండ భారతి రాజయ్య, పంబాల రాము కుమార్, అవారి శివకేసరి బాబు,  మున్సిపల్ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags:Plants should be protected from the eye

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *