కళాశాల ఆన్‌లైన్ క్లాసులో అశ్లీల వీడియో ప్లే

ముంబై (మహారాష్ట్ర):

 

 

కరోనా వైరస్ ప్రభావం వల్ల కళాశాల నిర్వహిస్తున్న ఆన్‌లైన్ తరగతుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని ముంబైనగరంలోని విల్లాపార్లేలోని ఓ కళాశాల నిర్వహిస్తున్న ఆన్‌లైన్ తరగతిలో ఒక్కసారిగా అశ్లీల వీడియో ప్రత్యక్షమైంది. ఆన్‌లైన్ తరగతిలో అశ్లీల వీడియో కనిపించడంతో విద్యార్థులు, ఉపాధ్యాయుడు షాక్ కు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆన్‌లైన్ తరగతిలో అశ్లీల వీడియోను ప్రదర్శించారని కళాశాల ప్రొఫెసర్ జుహు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జుహు పోలీసులు ఐపీసీ, ఐటీ యాక్టుల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags: Play pornographic video in college online class

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *