విద్యార్దుల జీవితాలతో ఆటలాడుతున్నారు-మంత్రి తలసాని
హైదరాబాద్ ముచ్చట్లు:
ప్రశ్నాపత్రాలను లీక్ చేసి విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని గాంధీ నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ ఓటేసి గెలిపించిన ప్రజలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏం చేశారు. కిషన్ రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం కాదు… సికింద్రాబాద్ లో చర్చకు వస్తావా అని అడిగారు.ముషీరాబాద్ ఎమ్మెల్యే గా పనిచేసి నేడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న లక్ష్మణ్ ఏం అభివృద్ధి చేశారు. ప్రభుత్వంపై విమర్శలు మాని అభివృద్ధి పై పోటీ పడండని బీజేపీ నేతలకు మంత్రి తలసాని సవాల్ విసిరారు.
Tags;Playing with students’ lives – Minister Talasani

