రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ

– సీనియర్‌ సివిల్‌ జడ్జి బాబునాయక్‌

Date:26/11/2020

పుంగనూరు ముచ్చట్లు:

సమాజంలో నివసించే పౌరులందరికి రాజ్యంగం అంధించిన హక్కులు ఉల్లంఘన జరగకుండ ప్రతి ఒక్కరు రాజ్యాంగ హక్కులను కాపాడుతామంటు సీనియర్‌ సివిల్‌ జడ్జి బాబునాయక్‌ స్వయంగా ప్రతిజ్ఞ చేయించారు. గురువారం కోర్టు ఆవరణంలో రాజ్యాంగ దినోత్సవం, లా దినోత్సవాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ న్యాయం కోసం కృషి చేస్తామని, సమస్యలు లేని నవసమాజాన్ని నిర్మించేందుకు రాజ్యాంగ హక్కులను పరిరక్షిస్తామంటు ప్రతిజ్ఞ చేశారు.అలాగే హక్కులతో పాటు బాధ్యతలను గుర్తించి, ప్రజలు చట్టాలకు లోబడి జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘ కార్యదర్శి కెవి.ఆనంద్‌కుమార్‌, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

నివర్‌ వరద భీభత్సం

Tags: Pledge to uphold the Constitution

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *