పుంగనూరులో 26న ప్లీనరీ సమావేశం- మంత్రి పెద్దిరెడ్డి రాక

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశం ఆదివారం మధ్యాహ్నం పట్టణంలోని మార్కెట్‌ కమిటి ఆవరణంలో నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా తెలిపారు. శనివారం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి , మంత్రి పీఏ చంద్రహాస్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశానికి రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరౌతారని తెలిపారు. ఈ మేరకు మార్కెట్‌ కమిటి ఆవరణంలో సభావేదికను సిద్దం చేస్తున్నారు. సభా వేదిక వద్ద భారీ కటౌట్లను, పార్టీ జెండాలను ఏర్పాటు చేశారు. ఈ సమావేశాన్ని జయప్రదం చేసేందుకు ప్రజాప్రతినిధులు, పార్టీ అనుబంధ సంస్థల నాయకులు, నామినేటెడ్‌ పదవుల చైర్మన్లు, డైరెక్టర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ అభిమానులు తప్పక హాజరుకావ లెనని కోరారు. ఈ ఏర్పాట్లను మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, రాష్ట్ర జానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యదర్శి ఫకృద్ధిన్‌షరీఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags: Plenary Session on 26th at Punganur – Arrival of Minister Peddireddy

Leave A Reply

Your email address will not be published.