Natyam ad

మర్రిపాడు మండల సర్వసభ్య సమీక్ష సమావేశం

-ఎంపీ ఆదాలతో కలిసి హాజరైన మంత్రి మేకపాటి
 
మర్రిపాడు ముచ్చట్లు:
నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డితో కలిసి ఐటి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోమవారం  మర్రిపాడు మండలకేంద్రంలో మండల అభివృద్ధి కార్యాలయ ప్రాంగణంలో సర్వసభ్య సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఆలస్యంగా జరిగే న్యాయం కూడా అన్యాయమే నని అన్నారు రెవెన్యూలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉందని ప్రజల సమస్యలను సతర్వరమే పరిష్కరించాలని ఆలస్యాన్ని, నిర్లక్ష్యాన్ని సహించనని అధికారులకు నేనిచ్చే స్వేచ్ఛ మరెవరూ ఇవ్వరు అని అయినా ప్రజలను పదే పదే తిప్పుకుంతున్నారని అలా చేస్తే సహించేది లేదుఅని అధికారులకు తెలియజేసారు
ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ సర్టిఫికెట్ లు గ్రామాల్లో సాధ్యం కావని గతంలో మరణాలకు సంబంధించి స్వయంగా వెళ్ళి అధికారులే పరిశీలించి, పరిశోధించి సరైన నిర్ణయం తీసుకోవాలని ఎంపీ తెలియజేసారు డిజిటల్ అసిస్టెంట్ ల లాగిన్ ద్వారా గ్రీవెన్స్ రేజ్ చేసి, భూమి అదనంగా పడినట్లు సాంకేతికంగా సర్వీస్ రిక్వెస్ట్ చేయాలి అని జేసీ వివరించారు మంత్రి అధ్యక్షతన జరిగిన రెవెన్యూ సంబంధిత గ్రీవెన్స్ పై ప్రధానంగా దృష్టి  పెట్టిన మంత్రి మేకపాటి మండలాన్ని ఆరు ఎంపీటీసీ సెగ్మెంట్లవారీగా  విడమరిచి  మంత్రి చర్చ జరిగింది.సింగనపల్లిలో పొలాల దారులు, స్మశాన స్థలాలకు సంబంధించిన సమస్యలు ప్రధానంగా ఉన్నట్లు మంత్రి మేకపాటి దృష్టికి  గ్రామస్తులుతీసుకువచ్చారు.
రికార్డ్ ఆఫ్ రైట్స్ సవరణలతో హక్కుదారులకు సాదా బైనామా ప్రకారంభూములనుఅప్పగిస్తామని జాయింట్ కలెక్టర్ మంత్రికి వెల్లడించారు.
 
 
ప్రభుత్వం రీ సర్వే చేసి  శాశ్వత భూ హక్కు కల్పించనుందని మంత్రి గౌతమ్ రెడ్డి తెలియజేసారు అనాదీన భూమిని అసైన్ ల్యాండ్ మార్చే ప్రక్రియ గురించి జేసీ వివరించారు
6వ విడత భూ పంపిణీ సరిగా జరగలేదని, క్షేత్రస్థాయిలో  పరిస్థితిని వివరించి జిల్లా అధికారులకు పంపుతామని ఎమ్ఆర్వో హమీద్
తెలిపారు.ఇర్లపాడులో భూ సమస్య గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకున్న మంత్రి గౌతమ్ రెడ్డిఇర్లపాడు గ్రామ పంచాయతీ తీర్మానం అందించి ఇస్తే మళ్లీ రీ వెరిఫై చేయిస్తామని తెలిపారు పశువులకు పశుగ్రాసానికి కూడా అవకాశం లేకుండా పంటలు వేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేయగా ఇర్లపాడు, ఇసుకపల్లి గ్రామాలలో పరిధి దాటి పంటలు వేసి, పశువులు కాసేవారికి సమస్య కలిగిస్తే  విఆర్వో లదే బాధ్యత అని ప్రభుత్వ రెవిన్యూ బోర్డ్ ఏర్పాటు చేయాలని  అలా చేయకపోతే సస్పెండ్ చేస్తామని  జేసీ హరేంద్రప్రసాద్ హెచ్చరించారు.
 
 
ప్రధానంగావ్యవసాయం,ఉద్యానవన,పంచాయతీరాజ్, పౌరసరఫరాలశాఖ, గ్రామీణ విద్యుత్, వైద్యఆరోగ్యం, ప్రాథమిక విద్య, ఉపాధిహామీ పథకం, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, ఐటీడీఏ, స్త్రీ, శిశుసంక్షేమశాఖ, పశుపోషణ, , వసతి గృహాలు, రోడ్డు భవనాలు వంటి శాఖలకు సంబంధించిన వివిధ సమస్యలు సభలో చర్చించారు సొంత మండలంలో అధికారులు ప్రజలకు పనులు చేయడం లేదనే వార్త నేను వినకూడదని మంత్రి గౌతమ్ రెడ్డి అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో
జిల్లా జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, కో ఆప్షన్ సభ్యులు గాజుల తాజుద్దీన్, జెడ్పీటీసీ మల్లు సుధాకర్ రెడ్డి, అనంతసాగరం జెడ్పీటీసీ రాపూరు వెంకట సుబ్బారెడ్డి, ఆత్మకూరు ఎంపీపీ కేతా వేణుగోపాల్ రెడ్డి, మర్రిపాడు ఎంపీపీ గంగవరపు లక్ష్మీదేవి, మర్రిపాడు మండల వైసీపీ కన్వీనర్ బొర్ర సుబ్బిరామిరెడ్డి, మండల వైసీపీ నాయకులు శ్రీనివాసులు నాయుడు, ఎమ్మాఆర్వో అబ్దుల్ హమీద్ , అనంతసాగరం మండలం ఎమ్ఆర్వో శ్రీనివాసులు రెడ్డి, ఎంపీడీవో సుస్మితా రెడ్డి, వీఆర్వోలు, ఇతర వైసీపీ నాయకులు,  మండల స్థాయి అధికారులు, ప్రజలు  తదితరులు హాజరైనరు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags; Plenary Zone Plenary Review Meeting