పుంగనూరులో 5 నుంచి పిఎల్‌ఆర్ వాలీబాల్ టోర్నమెంట్
పుంగనూరు ముచ్చట్లు:
పిఎల్‌ఆర్ రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్లు రెండు రోజుల పాటు జరగనున్నది. శని, ఆదివారాలలో జరిగే పోటీలకు ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, సీమ జిల్లాల మైనార్టీ సెల్ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము, మాజీ క్రీడాకారుడు గణేష్ లు కలసి స్థానిక బిఎంఎస్‌క్లబ్ మైదానాన్ని పరిశీలించారు. అలీమ్‌బాషా మాట్లాడుతూ రాజంపేట ఎంపీ , ప్యానల్ స్పీకర్ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి సహకారంతో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఎంపీ రూ.2 లక్షలు విరాళం ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలోని వాలీబాల్ క్రీడాకారులను ఆహ్వానించి పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. రెండు రోజుల పాటు జరిగే పోటీలకు హాజరై య్యే క్రీడాకారులకు భోజన, వసతి ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి తొలి బహుమతి క్రింద రూ.50 వేలు, రెండవ బహుమతి రూ.30 వేలు, మూడవ బహుమతి రూ.20 వేలు, నాల్గవ బహుమతి రూ.15 వేలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ పోటీలలో ఎవరైనా పాల్గొనవచ్చునని తెలిపారు. వివరాలకు సెల్‌నెంబరు: 9573630155, 9440216588 లను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు తుంగా మంజునాథ్, ప్రభు, మహబూబ్‌బాషా, అమ్ముకుట్టి తదితరులు పాల్గొన్నారు.

Tags: PLR volleyball tournament from 5 in Punganur
