కర్ణాటక ప్రజా తీర్పును స్వాగతించిన ప్రధాని మోదీ

PM Modi welcomed the Karnataka public verdict

PM Modi welcomed the Karnataka public verdict

Date: 09/12/2019

జార్ఖండ్ ముచ్చట్లు:

కర్ణాటక ప్రజా తీర్పును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. జార్ఖండ్ శాసన సభ ఎన్నికల సందర్భంగా హజారీబాగ్‌లో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో సోమవారం ఆయన మాట్లాడుతూ కర్ణాటక ప్రజలు కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పారన్నారు. కర్ణాటకలోని 15 శాసన సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. 12 స్థానాల్లో బీజేపీ విజయ ఢంకా మోగించింది. రెండింటిలో కాంగ్రెస్ విజయం సాధించగా, ఓ స్వతంత్ర అభ్యర్థి గెలిచారు.ఈ నేపథ్యంలో మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్-జేడీఎస్‌ కూటమికి ఎదురైన పరాభవాన్ని ప్రస్తావించారు.‘‘కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల తర్వాత, నేడు, ప్రజా తీర్పును అవమానించినవారికి ప్రజాస్వామిక పద్ధతిలో ఓటర్ల నుంచి సమాధానం దొరికింది’’ అని మోదీ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉండాలా? వద్దా? అనే పరిస్థితి ఉందని, కాంగ్రెస్‌ను ప్రజలు శిక్షించారని చెప్పారు. ఇది భారత దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఓ సందేశమని చెప్పారు. ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా ఎవరు నడుచుకున్నా, ప్రజలను అవమానిస్తున్నట్లేనని, అలాంటివారికి ప్రజలు అంతిమంగా బుద్ధి చెబుతారని అన్నారు.

 

హైకోర్టులో గొడవకు దారితీసిన దిశ ఎన్ కౌంటర్

 

Tags:PM Modi welcomed the Karnataka public verdict

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *