PM Modi's speech on race

 జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం

Date:30/06/2020

న్యూఢిల్లీ ముచ్చట్లు:

కరోనాతో పోరాటం చేస్తూ అన్ లాక్ 2.0లోకి ప్రవేశించాం.ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి.వాతావరణం మారుతున్నందున మీరందరూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.కరోనాతో చనిపోతున్నవారి సంఖ్యను చూస్తే..ప్రపంచంలో భారత్ పరిస్థితి మెరుగ్గా ఉంది.సరైన సమయంలో లాక్ డౌన్ పెట్టడం వల్ల కరోనా అదుపులో ఉంది.లాక్ డౌన్‌తో లక్షలాది మంది ప్రాణాలు కాపాడగలిగాం.కంటైన్మెంట్ జోన్లపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.నిబంధనలు పాటించని వారి తీరు మార్చాల్సిన అవసరం ఉంది.కానీ అన్ లాక్ 1.0 ప్రారంభమైనప్పటి నుంచి కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.కొద్ది రోజుల నుంచి మాస్కులు వేసుకోవడంలో ప్రజల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది.లాక్ సమయంలో నిబంధనలను చాలా కఠినంగా పాటించారు.మళ్లీ ఒకసారి రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలనుకఠినంగా చేయాల్సిన అవసరం ఉంది.ఒక దేశ ప్రధాని మాస్కు పెట్టుకోలేదని రూ.13 వేలు జరిమానా విధించారు.మన ప్రభుత్వాలు కూడా ఇదే స్ఫూర్తితో కఠినంగా వ్యవహరించాలి.9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.18 వేల కోట్ల నగదు జమ చేశాం.జులై నుంచి నవంబర్ వరకు 80 కోట్ల మందికి రేషన్ ఇస్తాం.5 కిలోల బియ్యంతోపాటు కిలో పప్పు ఇస్తాం.

టీడీపి ఎంపీ గల్లా జయదేవ్‌కు షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం

 

Tags:PM Modi’s speech on race

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *