పీఎంకేవీవై 3.0

Date:19/01/2021

న్యూఢిల్లీ ముచ్చట్లు:

మీకు ఉద్యోగం లేదా..? ఏ ఉపాధి లేకండా ఖాళీగా ఉన్నారా? అయితే మీకు కేంద్రం శుభవార్త చెబుతోంది. తాజాగా మోదీ సర్కార్ కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ స్కీమ్ ద్వారా మీరు సులభం గానే ఉపాధి పొందవచ్చు. మరి పూర్తిగా దీని కోసం ఇప్పుడే చూసేయండి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం తో ఉపాధి పొందవచ్చు. ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది.ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన స్కీమ్ మూడో విడత ప్రారంభించింది. దీని కోసం కేంద్రం ప్రకటన కూడా చేసింది. దీని మూలంగా నిరుద్యోగుల కి ప్రయోజనం కలుగనుంది అని చెప్పడం జరిగింది. దీనితో సులువుగా ఉపాధి లభించనుంది. నైపుణ్యాలు కూడా నేర్పిస్తూ ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన 3.0 లో భాగంగా యువతకు ఉపాధి కల్పిస్తారు. దీనిలో ఏకంగా 300కు పైగా కోర్సులు అందుబాటు లో ఉన్నాయి. వారికి నచ్చిన కోర్సును సెలెక్ట్ చేసుకుని యువకులు శిక్షణ పొందొచ్చు.పీఎంకేవీవై 3.0 స్కీమ్ కింద 2020-21 లో 8 లక్షల మందికి శిక్షణ ఇవ్వాలని మోదీ సర్కా్ర్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇది ఇలా ఉంటె ఈ 3.0 స్కీమ్ కింద రూ.948 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నారు. స్కిల్స్ కమిటీలను ఏర్పాటు చేస్తారు అని చెప్పడం జరిగింది. దీని వల్ల యువత వారికి నచ్చిన రంగం లో ఉపాధి పొందొచ్చు అని చెప్పారు. మీరు పీఎంకేవీవైఆఫీషియన్. ఓర్జీ వెబ్‌సైట్‌ కి వెళ్లి మీ పేరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అలానే ట్రైనింగ్ కూడా తీసుకో వచ్చు. ట్రైనింగ్ సర్టిఫికెట్ కూడా వస్తుంది.

అయోధ్యలో రామాలయ నిర్మాణానికిఅర్వపల్లి కోటేశ్వర్రావు సత్యవతి దంపతులు విరాళo

Tags: PMKVY 3.0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *