చార్మినార్ వద్ద భోగి పండుగ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

-భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ కవిత

Date:13/01/2021

హైదరాబాద్  ముచ్చట్లు:

ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఎమ్మెల్సీ కవిత. చార్మినార్ వద్ద భోగి వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, గత ఏడాది నుండి ప్రపంచాన్ని వెంటాడుతున్న కరోనా మహమ్మారి పీడ ఈ భోగి మంటల్లో కాలిపోవాలని కోరుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి పల్లెలో భోగి మంటల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటామన్న ఎమ్మెల్సీ కవిత… జీవితంలో చెడును పారద్రోలి, మంచిని కోరుకునే గొప్ప సాంప్రదాయం మనదన్నారు. సంక్రాంతి పండుగ ద్వారా అందరికీ శుభం కలగాలని, దేశమంతా సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. భాగ్యలక్ష్మీ దేవాలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానికంగా ఉన్న ఓ ఛాయ్ కేఫ్ కు వెళ్లిన ఎమ్మెల్సీ కవిత, స్థానికులతో కలిసి టీ తాగారు .

ఆసక్తికరంగా జమ్మలమడుగు పంచాయితీ

Tags:Poem by Emmelsie Kalwakuntla participating in the Bhogi festival celebrations at Charminar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *