Poetry aid for a man who is raising a wife and children

భార్య, బిడ్డలను కోల్పయిన వ్యక్తికి కవిత సాయం

Date:25/05/2020

నిజామాబాద్ ముచ్చట్లు:

ప్రమాదంలో భార్య, కూతుర్ని కోల్పోయి.. వీడియో కాల్ ద్వారా అంత్యక్రియలు చూసి కుమిలిపోయి, ఇటీవల దుబాయ్ నుంచి తిరిగొచ్చిన వ్యక్తికి నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత అండగా నిలిచారు.నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో భార్య, కూతుర్ని కోల్పోయి.. గల్ఫ్ నుంచి రాలేక.. వీడియో కాల్ ద్వారా అంత్యక్రియలు చూసి కుమిలిపోయిన ఓ వ్యక్తికి అండగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటకు చెందిన శ్రీనివాస్ బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. మే 15న మందమర్రిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అతడి భార్య సుజాత, పెద్ద కుమార్తె కావ్య ప్రాణాలు కోల్పోయారు. దుబాయ్ నుంచి వచ్చే అవకాశం లేకపోవడంతో.. శ్రీనివాస్ చిన్నకూతురే అంత్యక్రియలు నిర్వహించింది.వందే భారత్ మిషన్‌లో భాగంగా శ్రీనివాస్ రెండు రోజుల క్రితం హైదరాబాద్ తిరిగొచ్చాడు. నిబంధనల ప్రకారం అతణ్ని ప్రభుత్వం క్వారంటైన్లో ఉంచింది. తన భార్య అంత్యక్రియలకు హాజరు కాలేకపోయిన శ్రీనివాస్.. పెద్ద కర్మలకు కూడా హాజరు కాలేకపోతానేమోనని ఆందోళన చెందాడు. దుబాయ్‌లో ఉన్న తన మిత్రులకు ఈ విషయాన్ని తెలియజేశాడు.వారు ఈ విషయాన్ని మాజీ ఎంపీ కవిత దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆమె చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డికి విషయాన్ని వివరించారు. డీజీపీ అనుమతి తీసుకొని తన ఆఫీస్ సిబ్బంది ద్వారా ప్రత్యేక వాహనంలో శ్రీనివాస్‌ను సొంతూరు పంపించారు.

ప్రజల కోసం ఓ వ్యవస్థ : సీఎం జగన్

Tags; Poetry aid for a man who is raising a wife and children

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *