Natyam ad

తెలంగాణ రవీంద్రభారతి లో పుంగనూరు కవులకు ఘన సన్మానం..

-ఉమ్మడి రాష్ట్రాల కవితల పోటీలలో ప్రత్యేక స్థానం
-సాధించిన పుంగనూరు కవులు..

-హైదరాబాద్ రవీంద్రభారతిలో పుంగనూరు కవులకు సత్కారం..

 

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

నవ్యాంధ్ర రచయితల సంఘం అధ్యక్షులు, సినీ గేయ రచయిత కళారత్న బిక్కి కృష్ణ,తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు డా.నాలేశ్వరం శంకరం, డా.మంగళ మక్కపాటి మరియు తెలంగాణ అనువాద కవి అబ్దుల్ రశీద్ సమద్ ల ఆద్వార్యంలో ధార్మిక జనమొర్చా సద్భావనే ప్రగతికి సోపానం అనే ఆంశం పై హైదరాబాద్ రవీంద్రభారతిలో నవంబర్ 27న జరిగిన కవి సమ్మేళనం లో అనేక మంది ప్రముఖ కవులతో సద్భావనే ప్రగతికి సోపానం అనే అంశం పై నిర్వహించిన కవిత పోటీలలో వివిధ జిల్లా మరియు రాష్ట్రల నుండి అనేక మంది కవులు పాల్గొన్నారు. ఇందులో 40 మంది కవులు ఎంపిక కాగా అందులో చిత్తూరు జిల్లా పుంగనూరు కు చెందిన కవులు హసినా భేగం,సాల్వరాజు సతీష్ కుమార్,మరియు రాహాత్ జాన్,చౌడేపల్లి మండలం ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయునిరాండ్లు గాయత్రీ దేవి,వహీదా రహమాన్ లు తమదైన శైలిలో ఉత్తమ కవితలు అందించి తెలంగాణ,ఆంద్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల కవులతో పాటు ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. కవిత పోటీలలో ఎంపికలో ఒకే ప్రాంతం పుంగనూరు ఐదుగురు కవులు ఎంపిక అవడం చాలా విశేషం అని ప్రముఖులు వారిని దుస్యాలువలతో ఘనంగా సన్మానించి,సత్కరించి మెమోంటో మరియు ప్రశంసపత్రాలు అందజేసి అంశం పై ఉత్తమ కవితలు అందించారని ప్రశంసించారు.ఈ సందర్భంగా పుంగనూరు కవులు మాట్లాడుతూ ఈ మంచి కార్యక్రమంలో ఇంత మంది కవులతో పాటు మేము అందించిన కవితల కు హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా సన్మానించి మాకు మా పుంగనూరు కు మంచి ప్రాధాన్యత లభించడం చాలా సంతోషంగా ఉందని ఇంకా మును ముందు ఉత్తమ కవితలు,రచనలు అందించి రాష్ట్రంలో పుంగనూరు కు ఓ ప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికి కృషిచేస్తామని అన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో అవకాశం కల్పించిన ధార్మిక జనమొర్చా తెలంగాణ సబ్యులకు,ప్రముఖుల కు మరియు సినీ గేయ రచయితలందరికి కృతజ్ఞతలు తెలియజేశారు.

 

Tags: Poets of Punganur are honored in Telangana Rabindra Bharati..

Post Midle