బిల్లేరులో ప్రబలిన విష జ్వరాలు
– తిరపతి స్విమ్స్లో ఆందోళనకరంగా ఒకరు
-పుంగనూరు ప్రవేటు ఆసుపత్రిలో ఆరుగురు
– సమాచారమిచ్చినా స్పందించని వైద్య సిబ్బంది
– ఆందోళన వ్యక్తం చేస్తున్న బిల్లేరు ప్రజలు
చౌడేపల్లె ముచ్చట్లు:

మండలంలోని కొండయ్యగారిపల్లె పంచాయతీ బిల్లేరు గ్రామంలో విషజ్వరాలు విజృంభించాయి. విష జ్వరాలతో ఇంటికొకరు బాధితులుగా ఉన్నారు. ప్రజలు సమాచారం ఇచ్చినా వై ద్య సిబ్బంది అటువైపు కన్నెత్తి చూడడం లే దని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ వైద్య సిబ్బంది పట్టించుకోకపోవడం తో రోగులు పుంగనూరు, తిరుపతి ప్రాంతాలకు వెళ్లి మెరుగైన వైద్య చికిత్సలు పొందుతున్నారు. జి. రమేష్(32) పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి స్విమ్స్ కు తరలించి చికిత్సలు చేయిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వీరితోపాటు శివకుమార్(25) సి.చంద్రమ్మ(46) ప్రశాంత్ (30) యువ(4)యోగేంద్ర(4)రాధిక (13)మోతీషాచారి(12)హరిత(35) లు పుంగనూరులోని ఓ ప్రవేటు ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్నారు. వీరిలో మరికొంద రి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. పాఠశాల విద్యార్థుల అవస్థలు ధీన ంగా మారింది. ఎప్ప్రుడు ఏమి వార్త వినాల్సివస్తోందనని బిల్లేరు ప్రజలు భయబ్రాతులకు గుఔతున్నారు. డెంగ్యూ జ్వరంగా వైద్యులు నిర్థారించినట్లు చెప్పారు. వారం నుంచి విష జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలకు ప్రజలు సమాచారమిచ్చినా పట్టించుకోలేదని వాపోయారు. యాప్ లలో వివరాలు అప్‌లోడ్‌చేయాలని పనిఉందని, వీలు చూసుకొని వస్తామంటూ ప్రజలకు బదిలిచ్చినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లినా సరిగా పట్టించుకోకుండా వేరొక ఆసుపత్రికి రెఫర్‌చేస్తామని చెప్పారని రోగుల కుటుంభీకులు తెలిపారు. గ్రామంలోని తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంకును నెలల తరబడి శుభ్రపర చకపోవడంతో పాటు దోమల బెడద తీవ్రంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. ఇకనైనా జిల్లా కలెక్టర్ స్పందించి గ్రామంలో వైద్యశిభిరం ఏర్పాటుచేసి మెరుగైన వైద్య సేవలందించాలని బిల్లేరు గ్రామస్తులు కోరుతున్నారు.
Tags: Poisonous fevers prevalent in Billeru
