చౌడేపల్లెలో ముగ్గరు ప్రాణాలు తీసిన విషవాయువు-మంత్రి పెద్దిరెడ్డి పరామర్శ
-ఒకరి పరిస్థితి విషమం
చౌడేపల్లె ముచ్చట్లు:

ఏడాది క్రితం నిర్మించిన నీటి తొట్టిని శుభ్రం చేసేందుకు వెళ్లి ఆనీటిలో ఉన్న విషవాయువుల కారణంగా ముగ్గరు మృతి చెందగా, ఒకరి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సంఘటన చిత్తూరు జిల్లా , పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లె మండలం పెద్దకొండామర్రి గ్రామంలో జరిగింది. విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మృతుల కుటుంభాలను ఫోన్‌లో పరామర్శించి , సంతాపం తెలిపారు.
పెద్దకొండామర్రి గ్రామంలో వచ్చే వారం గంగజాతర జరగనున్నది. ఈ జాతరకు అవసర మైన మంచినీటిని నిల్వ చేసుకునేందుకు గ్రామంలో ఉన్న నూతనంగా నిర్మించిన సంపును శుభ్రం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కూలీ పని చేసే రమణ (30) , మునిరాజ(27) , రవి (37) , నాగభూషణంరెడ్డి(39) కలసి సంపు దగ్గరకు వెళ్లారు. నాగభూషణంరెడ్డి తొట్టిపై కట్టిన మూసమట్టిపై ఉండగా రవి , మునిరాజ, రమణలు తొట్టిలోపలకి దిగారు. అక్కడ విషవాయువులతో ఊపిరాడక అక్కడిక్కడే మృతి చెందారు. లోనికి దిగిన వారు పైకి రాకపోవడంతో నాగభూషణంరెడ్డి కేకలు వేయడంతో గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకుని తొట్టిలో ఉన్న వారిని వెలికితీశారు. ముగ్గరు మృతి చెందారు. నాగభూషణంరెడ్డి చికిత్స పొందుతున్నాడు. కాగా మృతులు మూడు కుటుంబాలకు చెందిన వారు. వారు ముగ్గరి మరణంతో ఆమూడు కుటుంభాలు వీధినపడ్డాయి. మృతులకు భార్యలు, చిన్నపిల్లలు ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే సీఐ మధుసూదన్‌రెడ్డి, ఎస్‌ఐ రవికుమార్‌లు సంఘటన స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
Tags: Poisonous gas that killed three people in Chaudepalle – Minister Peddireddy’s speech
