పేకాట క్లబ్.. ఎమ్మెల్యే అనుచరుల అరెస్ట్

గుంటూరు   ముచ్చట్లు:
గుంటూరు జిల్లా చిలకలూరిపేట మరోమారు హాట్‌టాపిక్‌గా మారింది. పేకాట ఆడుతూ ఏకంగా అధికార పార్టీ నేతలే బుక్కవడం కలకలం రేపింది. గుంటూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దులోని ఓ గ్రామ శివారులో ఏర్పాటు చేసిన పేకాట శిబిరంపై చిలకలూరిపేట పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. కోళ్లఫారంలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై దాడులు చేసి 35 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అందులో అధికార వైసీపీ నేతలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. పేకాట రాయుళ్ల నుంచి 13 లక్షల రూపాయలు సీజ్ చేశారు. ఇద్దరు నిర్వాహకులను కూడా అరెస్టు చేసినట్లు సమాచారం. పేటలో పేకాట రచ్చ బయటికి పొక్కడంతో జిల్లాలో గుప్పుమంది.అయితే ఈ వ్యవహారంలో చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రోద్బలంతో పేటలో పేకాట జోరుగా సాగేదని.. చిలకలూరిపేటని పేకాట క్లబ్బుగా మార్చేశారని రజనీ గతంలో విరుచుకుపడేవారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేటలో పేకాట లేకుండా చేశామని.. క్లబ్‌లు మూయించేశామని ఆర్భాటంగా చెప్పుకొచ్చారు. అయితే ఈ రోజు పోలీసులు పేకాట శిబిరంపై దాడి చేయడం.. అధికార పార్టీ నేతలే అడ్డంగా దొరికిపోవడం చర్చనీయాంశమైంది. దీంతో ఎమ్మెల్యే చెప్పేదొకటి.. నియోజకవర్గంలో జరుగుతోంది మరోటిలా ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిలకలూరిపేటలో పేకాట జోరు మళ్లీ మొదలైందన్న ఆసక్తికర చర్చ జరుగుతోంది…

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

 

Tags:Poker Club .. Arrest of MLA followers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *