గిరిగేట్ల గ్రామంలో పొలంబడి కార్యక్రమం

Date:25/01/2021

తుగ్గలి  ముచ్చట్లు:

తుగ్గలి మండల పరిధిలోని తుగ్గలి, గిరిగెట్ల గ్రామాల నందు సోమవారం రోజున శనగ పంట యందు పొలంబడి కార్యక్రమంను వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించారు. ఏవో పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఏడిఏ మహమ్మద్ ఖాద్రి పొలం బడి కార్యక్రమంలో భాగంగా శనగ పంట పైన అధిక దిగుబడులు, తక్కువ ఖర్చుతో పంట దిగుబడి పెంచుకొనే విధానం గురించి వివరించారు.పురుగు మందులు మితంగా వాడి,పంటపై  పురుగుల మరియు తెగుళ్ల నివారణ గురించి వివరించారు. అలాగే మిత్ర పురుగులు శత్రువులు వాటి గురించి కూడా వివరించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి రంగన్న,విఏఏ లు సాయినాథ్ రెడ్డి,లోహిత్ కుమార్,విజయ,గ్రామ వాలంటీర్లు,రైతులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్‌   త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌

Tags: Polambadi program in the village of Girigetla

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *