పోలవరం.. ఫస్ట్ ప్రియారటీ : జగన్

విజయవాడ ముచ్చట్లు :
ఏపీ సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టు పనులు, బిల్లుల చెల్లింపు, పెండింగ్ బిల్లులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టుకు రూ.1,600 కోట్ల మేర బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని వివరించారు. ఈ బిల్లులు వివిధ దశల్లో నిలిచిపోయాయని, రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చుకు సంబంధించి కేంద్రం వద్ద బిల్లులు పెండింగ్ లో ఉండడం సరికాదని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. పెండింగ్ బిల్లుల పరిష్కారంపై అధికారులు తక్షణమే దృష్టి సారించాలని ఆదేశించారు.రాబోయే 3 నెలలకు కనీసం రూ.1,400 కోట్ల ఖర్చు ఉంటుందని అధికారులు చెబుతున్నారని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, ఇప్పటికే చేసిన ఖర్చు రీయింబర్స్ మెంట్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. పోలవరం ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, రాష్ట్రం నుంచే ముందుగా డబ్బులు చెల్లిస్తున్నామని సీఎం జగన్ వివరించారు.ఈ సందర్భంగా జలవనరుల శాఖ అధికారులు సీఎంకు పోలవరం పనులు జరుగుతున్న తీరును వివరించారు. ఇప్పటివరకు 91 శాతం స్పిల్ వే కాంక్రీట్ పనులు జరిగాయని, మిగిలిన పనులు జూన్ రెండో వారం నాటికి పూర్తవుతాయని వెల్లడించారు. కాఫర్ డ్యాం నిర్మాణాలపైనా సీఎం జగన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. దిగువ కాఫర్ డ్యాం పనులు సత్వరమే పూర్తిచేయాలని స్పష్టం చేశారు.

 

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

Tags:Polavaram .. First Priority: Pics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *