యధఛ్చగా తరలిపోతున్న పోలవరం మట్టి

Polavaram mott
Date:08/11/2018
ఏలూరు ముచ్చట్లు:
పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం కుడికాలువ గట్టు మట్టిని యథేచ్ఛగా తవ్వేస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై ప్రభుత్వంగాని, జిల్లా అధికారులుగాని ఏమాత్రం స్పందించకపోవడంతో విచ్ఛలవిడిగా తవ్వేస్తున్నారు. పోలవరం కుడికాలువ గట్టు పొడవు మొత్తం 177 కిలోమీటర్లు. జిల్లాలో 121 కిలోమీటర్ల పొడవు ఉంది. కుడికాలువ తవ్వకంలో వచ్చిన మట్టిని రెండువైపులా గట్టుగా వేశారు.
అలాంటి గట్టును అధికార పార్టీ నేతలు కొల్లగొడుతున్నా అడ్డుకునేవారే లేకుండాపోయారు. మిషన్లు పెట్టి పట్టపగలే మట్టి దోపిడీ సాగిస్తున్నా జిల్లా అధికారులు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. ద్వారకాతిరుమల మండలం నారాయణపురం వద్ద 4,758 క్యూబిక్‌ మీటర్ల కుడికాలువ గట్టు మట్టిని తవ్వడం చూస్తే దోపిడీ ఏవిధంగా సాగుతుందో వేరే చెప్పనక్కర్లేదు. విజిలెన్స్‌ అధికారులు దాడిచేసి నాలుగు పొక్లెయిన్లను, 14 టిప్పర్‌లను సీజ్‌ చేయడమే కాకుండా రూ.15 లక్షలు జరిమానా విధించారు. వెంటనే టిడిపి ఎంఎల్‌ఎ ఒకరు రంగ ప్రవేశం చేసి అధికారులపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చి నానా హంగామా చేసిన పరిస్థితి నెలకొంది.
పెదవేగి మండలం కొప్పాకలోనూ కుడికాలువ గట్టు మట్టిని తవ్వేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదుతో విజిలెన్స్‌ అధికారులు దాడి చేయగా అధికార పార్టీ ఎంఎల్‌ఎ చేసిన హడావుడి అంతాఇంతా కాదు. దెందులూరు, ఉంగుటూరు నియోజకవర్గాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. టిప్పర్‌ మట్టిని రూ.నాలుగు వేలకు అమ్ముకుంటూ రూ.కోట్లు దండుకుంటున్నారు.
Tags: Polavaram mott

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *