Natyam ad

మోర్బీ ఘటనలో 9 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..

గాంధీనగర్ ముచ్చట్లు:

మోర్బీ ఘటన అనేక కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. గుజరాత్‌లోని మోర్బీలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై దర్యాప్తు వేగవంతంగా సాగుతోంది. ఇప్పటి వరకు 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ముఖ్యంగా బ్రిడ్జి కాంట్రాక్టర్, మేనేజర్, సెక్యూరిటీ, టికెట్ తీసుకున్న వారిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. వారిని విచారించనున్నారు. నిర్వహణకు సంబంధించిన వ్యక్తులందరినీ పిలిపించారు. దీంతో అక్కడ వంతెనను నిర్మిస్తున్న కంపెనీపై నేరపూరిత హత్య కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ప్రమాదంపై విచారణ జరుగుతోంది. ఐజిపి ర్యాంక్ అధికారి నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభించామని రాష్ట్ర హోం మంత్రి హర్ష్ సంఘ్వీ 31 అక్టోబర్ 2022 సోమవారం తెలిపారు.

 

 

అక్టోబర్ 30 ఆదివారం గుజరాత్‌లోని మోర్బీలో జరిగిన కేబుల్ బ్రిడ్జి ప్రమాదంలో ఇప్పటివరకు 134 మంది మరణించగా.. 177 మందిని రక్షించారు. నదిలో పడిపోయినవారిని రక్షించేందుకు సహాయ, సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయి. చాలా మంది ప్రజలు ఇప్పటికీ ఆసుపత్రిలో జీవితం, మరణం మధ్య వేలాడుతూనే ఉన్నారు. అయితే మోర్బి నివాసితులు ప్రజలను రక్షించడానికి సాధ్యమైన ప్రతిదాన్ని చేస్తున్నారు. రక్తదానం చేసేందుకు భారీగా జనం తరలివస్తున్నారు. రక్తదానం చేసేందుకు వస్తున్నవారితో ఆసుపత్రి పరిసరాలు నిండిపోయాయి. మానవత్వం ఇంకా చావలేదని ఈ దృశ్యాలు నిరూపించాయి.బాధిత కుటుంబాలకు 6 లక్షల పరిహారం ప్రకటించారు. రాత్రంతా సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారని ఆయన చెప్పారు. ఘటన జరిగిన వెంటనే నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. రాత్రికి రాత్రే 200 మందికి పైగా జవాన్లు సోదాలు, సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.

 

 

Post Midle

సెకనులోనే  అంతా విషాదం
గుజరాత్‌ మోర్బీలో కేబుల్‌ బ్రిడ్జ్‌ కూలిన ఘటనలో 141 మంది ప్రాణాలు కోల్పోయారు. 117 మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. మరికొంత మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బ్రిడ్జ్‌ కూలడానికి కొద్ది క్షణాల ముందు సీసీ కెమెరాలో రికార్టయిన దృశ్యాలను టీవీ9 ఎక్స్‌క్లూజివ్‌గా చూపిస్తోంది. 15 సెకన్లు.. కేవలం 15 సెకన్లో ఘోరం జరిగిపోయింది.. కేబుల్ బ్రిడ్జ్ కావడంతో అది చిన్నగా అటూఇటూ ఊగడం మొదలైంది. అది వైర్లు తెగిపోవడానికి ఆఖరు క్షణాలని ఎవరూ ఊహించలేదు. ఊగిసలాటను ఎంజాయ్‌ చేస్తూ ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ అంతా సంతోషంగా ఉన్నారు. ఇంతలోనే ఘోరం జరిపోయింది. రెప్పపాటులో వైర్లు తెగిపోయాయి. మొత్తం అంతా నీళ్లలో పడిపోయారు.

 

 

 

ఏం జరిగిందో అర్థమై పైకివచ్చే టైమ్ కూడా లేదు. ఇంతలోనే తొక్కిసలాట మొదలైంది. ఈత రాని వాళ్లు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ఎలాగోలా ఒడ్డుకు చేరుకున్నారు. కేబుల్‌ బ్రిడ్జి వైర్లను పట్టుకుని వేళ్లాడిన వాళ్లలో కొందరు ఎట్టకేలకు పైకి రాగలిగారు.
కెపాసిటీకి మించి బ్రిడ్జ్‌కి పైకి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలింది. 100 మంది కెపాసిటీ ఉన్న వంతెనపైకి 400మంది రాడంతో వంతెనే కూలినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే కొంతమంది ఈత కొట్టి ప్రాణాలు కాపాడుకున్నారు. చాలా మంది వంతెనలో ఇరుక్కుపోయారు. వారిని సహాయక సిబ్బంది సురక్షతంగా బయటకు తీశారు. ఇప్పటి వరకూ 141 మృతదేహాలు లభ్యమయ్యాయి. వాటిని తమతమ కుటుంబాలకు అప్పగించారు. 11మంది గాయపడినట్లు వెల్లండించారు అధికారులు. ఆదివారం సాయంత్రం నుంచి జరిగిన రెస్క్యూ ఆపరేషన్‌లో మొత్తం 117 మందిని రక్షించారు.ఘటనపై మోదీ సంతాపం వ్యక్తం చేశారు. వెంటనే సహాయక బృందాలను రంగంలోకి దించాలని ఆదేశించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 4లక్షలు, కేంద్రం నుంచి 2లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డవారికి 50వేల ప్రకటించారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. మోర్బీ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు.

 

 

కుటుంబ సభ్యులను కోల్పొయిన బీజేపీ ఎంపీ
గుజరాత్‌లోని మోర్బీలో ఆదివారం సాయంత్రం సంభవించిన మోర్బి కేబుల్ వంతెన కూలిన ప్రమాదంలో ఇప్పటివరకు 141 మందికి పైగా మరణించినట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. అయితే స్థానికుల సమాచారం ప్రకారం 180 మందికి పైగా మరణించారు. అంతే కాదు ఈ విషాదంలో బీజేపీ ఎంపీ 12 మంది బంధువులను కోల్పోయారు. ఈ దుర్ఘటనపై రాజ్‌కోట్‌ బీజేపీ ఎంపీ మోహన్‌భాయ్‌ కుందారియా మాట్లాడుతూ.. ఈ ఘటన చాలా బాధాకరమన్నారు. ఆదివారం సాయంత్రం నుంచి ఇక్కడే ఉన్నాను. ఇప్పటి వరకు వందల సంఖ్యలో మృతదేహాలను వెలికి తీశారు. ఈ విపత్తులో మా బంధువులు కూడా చనిపోయారు. నా బావ నలుగురు కుమార్తెలు, ముగ్గురు కోడళ్లు, 5 మంది పిల్లలను కోల్పోయినట్టుగా చెప్పారు. తప్పు ఎవరు చేసినా చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరూ తప్పించుకోలేరని హెచ్చరించారు. ఈ ప్రమాదంలో నిజం 100% బయటకు వస్తుందన్నారు. ప్రధాని మోదీ కూడా ఈ అంశంపై నిరంతరం నిఘా పెడుతున్నారు. దీనిపై రాత్రంతా ఫోన్ లో సమాచారం అడిగి తెలుసుకుంటున్నారని చెప్పారు.ఈ దుర్ఘటనలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భారత హైకమిషనర్ సైమన్ వాంగ్ సంతాపం తెలిపారు.

 

 

 

గుజరాత్‌లోని మోర్బీలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం అన్నారు. మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని చెప్పారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి, సహాయక చర్యలకు డ్రోన్‌లను ఉపయోగిస్తున్నారు.ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి రూ. 50,000 పరిహారాన్ని ప్రకటించారు ప్రధాని మోడీ. గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘవి కూడా మోర్బీలో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై క్రిమినల్ కేసు నమోదు చేశామని.. ఈరోజు రేంజ్ ఐజీపీ నేతృత్వంలో విచారణ ప్రారంభించామని తెలిపారు.గుజరాత్, రాజస్థాన్‌లలో మూడు రోజుల పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ, మోర్బీ కేబుల్ వంతెన కూలిన ఘటన నేపథ్యంలో సోమవారం అహ్మదాబాద్‌లో జరగాల్సిన రోడ్‌షోను రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు. మోర్బీ వంతెన వందేళ్ల పురాతనమైనది దీన్ని ఐదు రోజుల క్రితమే.. విస్తృత మరమ్మతులు, పునరుద్ధరణల తర్వాత తిరిగి తెరిచారు. ఈ వంతెన ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు కూలిపోయింది. ఆ సమయంలో వంతెన మీద జనం కిక్కిరిసి ఉన్నారు.

 

Tags: Police arrested 9 people in Morbi incident..

Post Midle

Leave A Reply

Your email address will not be published.