ఆర్కే కోసం పోలీసుల గాలింపు షురూ..

Date:18/05/2018
విజయనగరం ముచ్చట్లు:
మావోయిస్టు అగ్రనేత ఆర్కే అలియాస్ రామకృష్ణ కోసం పోలీసులు మళ్లీ ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ సారి ఆపరేషన్ ఆర్కే పేరుతో ప్రత్యేకంగా గ్రూప్ ను ఎర్పాటు చేశారు. ఎలాగైనా ఆర్కే ను పట్టుకోవాలన్న లక్ష్యంతో పోలీసు బలగాలు ముందుకు పోతున్నాయి. ఇందులో భాగంగా తమకు వచ్చిన ప్రతి ఆవకాశాన్ని కూడా వినియోగించుకుంటున్నాయి. ఆంధ్రాలో తమ పట్టును పెంచుకునేందుకు మావోయిస్టు పార్టీని ప్రయత్నాలు చేస్తునే వుంది. ఈ నేపధ్యంలో ఆంధ్రా సరిహద్దు ప్రాంతంలో అగ్రనేతలు ఎప్పటికప్పుడు వచ్చి మీటింగ్ లుపెట్టి నోతున్నారు. ఈ సమాచారం తెలుసుకుని పోలీసులు బలగాలు తమ కూంబింగ్ ను ముమ్మరం చేస్తున్నారు.ఆంధ్రా-ఒడిషా సరిహద్దులో మావోయిస్టులు, గ్రే హౌండ్స్‌ పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉన్నట్లు సమాచారం ఉంది. బలిమెల రిజర్వాయర్‌ పరిధిలోని జొడాంబో ఏరియా-సిమిలిపొదరల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. మావోయిస్టు నాయకుడు ఆర్కేతో పాటు మరో ఇద్దరు ప్రముఖ నేతలు కూడా ఎదురుకాల్పుల్లో వున్నట్లుగా సమాచారం వస్తుంది.. .మేజర్ ఫైరింగ్ అటు ఏవోబీ ఏరియా లో జరుగుతుంది.గత నెలలో మహారాష్ట్రలోని గడ్చిరోలి అడవులు, చత్తీస్‌గఢ్‌లోని గోదావరి పరివాహాక ప్రాంతాల్లో పోలీసులకు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో దాదాపు 40 మంది మావోయిస్టులు మరణించారు. గడ్చిరోలి ప్రాంతంలో 38 ఏళ్ల క్రితం ప్రారంభమైన గడ్చిరోలి తిరుగుబాటు ఉద్యమం చరిత్రంలో ఇదే అతి పెద్ద ఎన్‌కౌంటర్‌. ఇదిలా వుంటే ఆర్కేకు సంబంధించిన సమాచారం తమ వద్ద లేదని.. ఎదురు కాల్పులు జరిగినప్రాంతం నుంచి ఇంకా పూర్తి స్దాయిలో సమాచారం రావాల్సి వుందని ఎపి పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు.
Tags: Police Arrested for Arke ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *