దాచేపల్లి మావోయిస్టు లేఖను ఛేదించిన పోలీసులు 

Date:14/03/2019
గుంటూరు ముచ్చట్లు:
గుంటూరు జిల్లా దాచేపల్లి పోలీస్ స్టేషన్ లో గురజాల డియస్పీ శ్రీహరి బాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. గత రెండురోజుల క్రితం మావోయిస్టుల పేరుతో వాల్ పోస్టర్లు వెలిసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయంపై దర్యాప్తు జరిపిన పోలీసులు లేఖల వెనుక గుట్టు రట్టు చేసారు. మండలంలోని బట్రుపాలెం గ్రామానికి చెందిన అనిల్ నాయక్,  పట్టణానికి చెందిన ఆంజనేయ రాజు అనే ఇద్దరు యువకులు సెన్షేషనల్ క్రియేట్ చేసి మానసిక ఆనందం పొందటం కోసం ఈ పనికి పాల్పడ్డారని పోలీసులు నిర్దారించారు. ఇంకా విచారణ కొనసాగితుందని ఈ ఘటనలో ఎంతటి వారు వున్న ఉపేక్షించేది లేదని తెలిపారు. అంజనేయరాజు అనే వ్యక్తి సింగపూర్ లో వర్క్ చేస్తున్నాడని అతను వాల్ పోస్టర్ లను అక్కడే తయారు చేసి కొరియర్ లో పంపించడాని వాటిని అనిల్ నాయక్ అంటించడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో గురజాల రూరల్ సిఐ అంకమ్మరావు, యస్ ఐ రాజేష్,పియస్ ఐ జనార్దన్,పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Tags:Police arrested the Maoist letter from Dakhepalli

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *