షేక్ జవహర్ బాషా హత్య కేసులో నిందితులను అరెస్ట్ చూపుతున్న పోలీసులు

తిరుపతి  ముచ్చట్లు:

చిల్లకూరు మండలం వడ్డిపాలెం గ్రామానికి చెందిన షేక్ జవహర్ 2211బాషా(52)అనే వ్యక్తి హత్య కేసులో నిందితులైన అయ్యవారిపాలెం కు చెందిన దర్శిగుంట బాబు,తుమ్మూరు గౌతం అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి చిల్లకూరు పోలీస్ స్టేషన్ లో మీడియా ముందు ప్రవేశ పెట్టిన పోలీసులు….

కేసు వివరాలు….

గూడూరు DSP M.రాజగోపాల్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు చిలుకూరు మండలం వడ్డిపాలెం గ్రామానికి చెందిన జవహర్ బాషా అనే వ్యక్తి వృత్తిరీత్యా ఆటో నడుపుకుని జీవనం సాగిస్తూ మంచి నడవడికతో సౌమ్యుడుగా పేరు తెచ్చుకున్నాడు, అతను చేతికి ఎనిమిది బంగారు ఉంగరాలు ధరించేవాడు, ఇది గమనించిన అయ్యవారిపాలెం గ్రామానికి చెందిన డి.బాబు,టి.గౌతం అనే ఇద్దరు వ్యక్తులు ఇతనిని చంపి బంగారు ఉంగరాలు స్వాధీనం చేసుకోవాలని ముందస్తు ప్రణాళికతో గత నెల 15వ తేదీ బాడుగ ఉందని చెప్పి ఆటోలో కొంచెం దూరం తీసుకెళ్లి గొంతు కోసి చంపి ముళ్ళ పొదల్లో పడేసి మరుసటి రోజు రాత్రి మృతదేహాన్ని ఆటోలో తీసుకుని గోను సంచిలో వుంచి మృతదేహం తో పాటు రాళ్ళు కూడా పెట్టి శవం తేలకుండా వుండేందుకు గూడూరు రూరల్ ప్రాంతం లోని రామలింగాపురం సమీపంలో కైవల్యా నదిలో పడేశారు,

 

 

 

జవహర్ బాషా కనిపించడం లేదని వాళ్ళ తమ్ముడు ముజహర్ 15 వ తేదీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విషయం తెలుసుకున్న తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఆదేశాలతో గూడూరు డిఎస్పి ఎం రాజగోపాల్ రెడ్డి సూచనలతో గూడూరు రూరల్ సీఐ శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ సుధాకర్ రెడ్డి మరి కొంతమంది పోలీస్ సిబ్బంది బృందాలుగా ఏర్పడి సాంకేతికత సాయంతో నిందితులను నిన్న సాయంత్రం పట్టుకుని వారి వద్ద నుండి జవహర్ భాష కు సంబంధించిన 8 బంగారు ఉంగరాలు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు, అలాగే హత్యకు ఉపయోగించిన కత్తులు వారి వద్ద నుండి సెల్ఫోన్ కూడా స్వాధీనం చేసుకొని వారికి కఠినంగా శిక్షలు పడేలా అన్ని సాక్షాలు పక్కాగా సేకరించి చార్జిషీటు కోర్టుకు దాఖలు చేస్తామని ఈ కేసులో ఎటువంటి ఆధారాలు లేకున్నా ఎంతో చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ చూపిన గూడూరు రూరల్ సీఐ శ్రీనివాసులు రెడ్డికి,చిల్లకూరు ఎస్సై సుధాకర్ రెడ్డిని ఇతర పోలీసు సిబ్బంది R.V రాజు, రహీం,సుబ్రమణ్యం,వెంకటేశ్వర్లు ఇతర సిబ్బందిని గూడూరు డిఎస్పి ఎం రాజగోపాల్ రెడ్డి అభినందించారు.

 

Tags: Police arresting accused in Sheikh Jawahar Basha murder case

Leave A Reply

Your email address will not be published.