లాడ్జిపై పోలీసుల దాడి

-యాజమాన్యం,నిర్వాహకులపై  కేసు నమోదు

నిజామాబాద్ ముచ్చట్లు:

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ కు సమీపంలో ఉన్న నవ దుర్గ లాడ్జ్ లో ఆదివారం  వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు సమాచారం అందడంతో  ఒకటవ టౌన్  పోలీసులు దాడి చేసి నిర్వాహకులు చెన్న గంగాదాస్,అలియాస్ రాము, చెన్న దీక్షిత్, గుండేటి బొజన్న, సతీష్ ల పై కేసు నమోదు చేసినట్టు, బాధితురాలిని స్వధర్ హోమ్ కు తరలించినట్లు వన్ టౌన్ సిఐ  విజయబాబు వివరించారు. ఇదిలా వుండగా గత కొన్నేళ్లుగా ఈ లాడ్జ్ లో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్న సంగతి బహిరంగ రహస్యమే. పలుమార్లు చుట్టూ వున్న పలు షాపుల యజమానులు సైతం బిల్డింగ్ యజమానికి, పోలీసులకు గతంలో సైతం ఫిర్యాదు చేసినట్టు స్థానికులు తెలిపారు. మైనర్ బాలికలను ఈ  కూపంలోకి ధింపుతున్నట్టు, ఈ విషయం ఇన్నేళ్లుగా ఎవరు  పట్టించుకోక పోయే సరికి వదిలేసినట్లు సమాచారం. ఏదేమైనా ఇప్పటికైనా పోలీస్ అధికారులు చర్యలు చేపట్టినందుకు లాడ్జి పక్కన ఉన్న వ్యాపార సముదాయాల నిర్వాహకులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

 

Tags: Police attack on the lodge

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *