అందుబాటులో పోలీసులు

Date:29/06/2020

నిర్మల్ ముచ్చట్లు:

పోలీసులు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటారని ప్రజలకు సేవ చేయడంలో నిర్మల్ పోలీసులు ముందుంటారని నిర్మల్ జిల్లా ఎస్పీ శ్రీ.సి.శశిధర్ రాజు గారు అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో పాల్గొని జిల్లాలోని ఆయా మండలాల నుంచి వచ్చిన ఆర్జీ దారులతో ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు సమస్యలతో పోలీసు స్టేషన్ వచ్చినప్పుడు తక్షణమే స్పందించి న్యాయం జరిగేలా చేసినప్పుడే ప్రజలకు పోలీసులపై నమ్మకం ఉంటుందని పేర్కొన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, అంటు వ్యాధులు, విష జ్వరాలు ప్రబలకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని మరియు శానిటైజర్ వాడాలని అన్నారు. ప్రజలు కూడా పోలీసులకు సహకారం అందించాలని, అనుమాస్పదన వ్యక్తులు కనబడినా, సంఘ వ్యతిరేక చర్యలు జరుగుతున్నాయని దృష్టికి వస్తే వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ చేయాలి లేదా జిల్లా వాట్సప్ నెం.8333986939కు సమాచారం తెలియజేయాలని కోరారు.

ఉపాధ్యాయులు పొట్టకూటి కోసం తిప్పలు పడుతున్నారు

Tags:Police available

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *