Natyam ad

ఏపీ డీజీపికి పోలీసు పురస్కారం

అమరావతి ముచ్చట్లు:


ఆంధ్రప్రదేశ్ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డికి రాష్ట్రపతి ఉత్తమ పోలీస్ సేవా పతకం(ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్–పీపీఎం) లభించింది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకల వేళ కేంద్ర హోం శాఖ ఈ అవార్డును ప్రకటించింది. విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించినందుకు ఉత్తమ సేవలు–2020 సంవత్సరానికి ఈ పురస్కారం దక్కింది. ఈ పతకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం రోజున అందజేయనున్నారు. 1992 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర డీజీపీగా పనిచేస్తున్న సంగతి తెల్సిందే. రాజేంద్రనాథ్ రెడ్డి గతంలో విజయవాడ నగర పోలీస్ కమిషనర్, ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్, విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్తోపాటు పలు హోదాల్లో విధులు నిర్వహించారు.

 

Tags: Police award to AP DGP

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.