డయల్ 100 పై పోలీసుల అవగాహన కార్యక్రమం

Date:06/01/2020

ఖమ్మం ముచ్చట్లు:

ఈరోజు కాజీ పురం గ్రామంలో పాలిటెక్నికల్ కళాశాల యందు మధిర  సీఐ వేణు మాధవ్ , మధిర రూరల్ ఎస్సై లవన్ కుమార్ , టౌన్ ఎస్ఐ ఉదయ్ కిరణ్ డయల్ 100 గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు బహిరంగ ప్రదేశాలు, రద్దీగా ఉన్న ప్రదేశాలు,బస్టాండ్ వంటి ప్రాంతాలలో విద్యార్థులను యువకులను వేధింపులకు గురి చేస్తే వెంటనే డయల్ 100 కాల్ కి ఫోన్ చేస్తే పది నిమిషాలలో సంఘటన స్థలానికి చేరుకొని తక్షణ చర్యలు తీసుకుంటామని  తెలిపినారు. ఎవరైనా ఆపదలో ఉంటే ఏరియా తో సంబంధం లేకుండా ముందస్తుగా సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కోరారు అదేవిధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.సైబర్ క్రైమ్ గురించి అవగాహన  కల్పించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్  మరియు సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

 

8వ తారీకున సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి

 

Tags:Police Awareness Program on Dial 100

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *