కోరిన సమాచారం ఇవ్వని అధికారులపై పోలీసు కేసు పెట్టవచ్చు : రాష్ట్ర సమాచార కమిషన్

అమరావతి అమరావతి :

 

ఆర్టీఐ దరఖాస్తు ద్వారా సమాచారం అడిగిన తరువాత మా దగ్గర ఇంతే సమాచారం ఉంది అంటూ కొంత సమాచారం ఇచ్చి మిగిలింది మా వద్ద లేదని ఇస్తున్నారు. ఉద్యోగులు అలా లేదు అనే ముందు అట్టి ఫైళ్లు ఏమైయ్యాయి కనబడని ఫైళ్లు పోయిన ఫైళ్లు గురించి పోలీస్ ఫిర్యాదు చేశారా? లేదా చేయకపోతే ఎందుకు చేయలేదు? అంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించారు.ఉద్యోగ బాధ్యతల్లో తమ వంతు కర్తవ్యం ఎంత వరకు నిర్వర్తిస్తున్నారా? లేదా? అలా పోలీసు కంప్లైంట్ ఇవ్వని అధికారి పై ఆర్టీఐ దరఖాస్తు దారుడు కేసులు పెట్టవచ్చునని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి.ఫైళ్లు పోయినా చర్యలు లేవా? ఉంటే ఎటువంటి చర్యలు తీసుకుంటారు.ఇకపై ఆర్టీఐ దరఖాస్తు ద్వారా సమాచారం అడిగిన సోదరి.. సోదరులారా.. అడిగిన సమాచారం కొంత ఇచ్చి మిగిలిన సమాచారం ఇవ్వని పక్షంలో అట్టి సమాచారం వారి వద్ద లేదని భావించి వారిపై పోలీసు ఫిర్యాదు చేయవచ్చు. ఈ విషయం స్వయంగా సమాచార కమిషన్ వారు తెలిపారు. ఇకపై ఆర్టీఐ కార్యకర్తలు గుర్తు ఉంచుకొని అట్టి అధికారులపై చర్యలు కొరకు పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయవచ్చు.

 

 

 

Tags:Police can file a case against officials who do not provide the requested information: State Information Commission

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *