పోలీస్ లాఠీలతో ఉద్యమాలను ఆపలేరు

Date:09/11/2019

జగిత్యాల ముచ్చట్లు:

ఆర్టీసీ సమ్మెలో భాగంగా శనివారం నిర్వహించిన మిలియన్ మార్చ్ కి ఛలో ట్యాంక్ బండ్ ను ముట్టడించిన ఆర్టీసీ కార్మికులకు హాట్సాప్ తెలియజేస్తూ లాఠీ ఛార్జ్ తో ఉద్యమాలను ఆపలేరని తెలంగాణ జనసమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి పేర్కొన్నారు.
ఇకనైనా ప్రభుత్వం చర్చలు జరిపి సమ్మెను విరమింప జేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. శనివారం చలో ట్యాంక్ బండ్ సందర్భంగా ఆర్టీసీ కార్మికులమీద, ప్రజా ప్రతినిధుల మీద కేసీఆర్ ప్రభుత్వం లాఠీ ఛార్జ్ చేయడం చట్ట విరుద్ధమని అన్నారు. మిలియన్ మార్చ్ ను విచ్చిన్నం చేసే కుట్రతో అక్రమంగా అరెస్ట్ చేసిన ఆర్టీసీ కార్మికులను, రాజకీయ నాయకులను, ప్రజా సంఘాల నాయకులను, ప్రజా ప్రతినిధులను, ఆఖిలపక్ష నేతలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ జె.ఏ.సి నాయకులతో  వెంటనే చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాల్సిందిగా చుక్క గంగారెడ్డి డిమాండ్ చేశారు.లేని పక్షములో ఉద్యమాలను మరింత ఉదృతం చేయడంతో పాటు అధికార పార్టీ ప్రజాప్రతినిధులను అడ్డుకుంటామని చుక్క గంగారెడ్డి హెచ్చరించారు.

 

సహజసిద్ధమైన ఆహారంతో సంపూర్ణ ఆరోగ్యం.. 

 

Tags:Police cannot stop movements with batons

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *