చింతపల్లిలో పోలీసులు తనిఖీలు

చింతపల్లి  ముచ్చట్లు:
విశాఖ ఏజెన్సీ చింతపల్లి ఇటీవల జరిగిన కొయ్యూరు  మండలం తీగల మెట్టు అటవీ ప్రాంతంలో పోలీస్ ఎన్ కౌంటర్ లో మృతిచెందిన మావోయిస్టులను నిరసనగా  జూలై ఒకటో తారీఖున ఏవోబీ అంతటా మావోయిస్టు పార్టీ పేరిట బందుకు పిలుపు నిస్తూ లేఖ విడుదల చేశారు.  ఈ బంద్ను భగ్నం చేయడానికి చింతపల్లి  పోలీస్ సబ్ డివిజన్ ఏ .ఎస్.పి విద్యాసాగర్ నా నాయుడు నేతృత్వంలో చింతపల్లి అన్నవరం జీకేవీధి కొయ్యూరు మంప  సీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా వాహనాలు తనిఖీ చేస్తూ డ్రోన్ కెమెరా లతో నిఘా ఏర్పాటు చేసి అనుమానిత వ్యక్తుల నుండి పూర్తి వివరాలు అడిగి తెలుసు కొని ఆరా తీస్తున్నారు దీంతో ఒక ప్రక్క పోలీసులు మరోపక్క మావోయిస్టులు  అలజడులు చూస్తుంటే మన్య వాసులు ఎప్పుడు ఏం జరుగుతుందో అని  భయాందోళనలు చెందుతున్నారు.  ఈ బంద్ ప్రభావం వలన ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతిష్టాత్మకంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

Tags:Police checks in Chintapalli

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *