పోలీసుల తీరు వల్లే తాడిపత్రి లో  గొడవలు

Police clashes in the hospital

Police clashes in the hospital

Date:19/09/2018
అనంతపురం ముచ్చట్లు :
వినాయక నిమజ్జనం సందర్భంగా శనివారం తాడిపత్రి సమీపంలోని చిన్నపొడమల వద్ద ప్రబోధానంద అనుచరులు, గ్రామస్థులకు మధ్య చేలరేగిన వివాదం చినికిచినికి గాలివానలా మారిన విషయం తెలిసిందే. ఈ సమయంలో గ్రామస్థులు, ప్రబోధానంద భక్తుల మధ్య జరిగిన కొట్లాటలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గ్రామస్థులకు మద్దతుగా ధర్నాకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకుంది.
ఈ వ్యవహారంపై బుధవారం సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సమయంలో పోలీసులపై జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. పోలీసుల వైఫల్యం కారణంగానే చిన్నపొడమలలో ఘర్షణ చోటుచేసుకుందని జేసీ ఆరోపించారు. ఆశ్రమంలోని ప్రబోధానంద వర్గీయులు రాళ్లతో దాడి చేస్తుంటే చేతిలో తుపాకులు, లాఠీలు ఉన్న పోలీసులే తమ కంటే ముందు పారిపోయారని జేసీ విమర్శించారు.
వాహనాలను తగులబెడుతుంటే పోలీసులు చోద్యం చూశారని, వారు ధైర్యంగా నిలబడి కనీసం గాల్లోకి కాల్పులు జరిపినా ఇంతటి విధ్వంసం జరిగేది కాదన్నారు. చిన్నపొడమలలో శాంతిభద్రతల పరిరక్షణలో స్థానిక పోలీసులు దారుణంగా విఫలమయ్యారని.. ఆశ్రమానికి కిలోమీటర్ దూరంలో తాను ధర్నాకు దిగానని జేసీ వెల్లడించారు. ఉదయం నుంచి తాను ధర్నాకు కూర్చుంటో మధ్యాహ్నం 12.30 గంటల వరకూ ఒక్క పోలీస్ అధికారి కూడా రాలేదనీ, కనీసం తమను పట్టించుకోలేదని జేసీ విమర్శించారు.
ఒకప్పుడు ఎర్రటోపీ పెట్టుకుని పోలీసులు ఊర్లో అడుగుపెడితే అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేవాళ్లు పారిపోయేవారని అన్నారు. ప్రస్తుతం అనంతపురంలోని ఓ కానిస్టేబుల్‌ కాలర్‌‌ పట్టుకున్న ఓ వ్యక్తిపై ఇప్పటిదాకా చర్యలు తీసుకోలేని పరిస్థితికి అధికారులు దిగజారిపోయారని మండిపడ్డారు. ఇది ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎంతమాత్రం కాదని స్పష్టం చేశారు. పోలీసులు గాల్లో కాల్పులు జరిపి ఉంటే చిన్నపొడమలలో ఇంత దారుణం జరిగేది కాదని జేసీ పేర్కొన్నారు.
ప్రబోధానంద ఆశ్రమ నిర్వాహకులపై ఐదుసార్లు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు ఫిర్యాదు చేసినా, నిన్నటివరకూ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వ్యాఖ్యానించారు. ఆశ్రమంలో పోలీసులు మంగళవారం చేపట్టిన తనిఖీల్లో ఆయుధాలు లభ్యమయ్యాయని తెలిపారు. మరోవైపు చిన్నపొడమలలో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. స్థానికేతరులను గుర్తించి వారి స్వస్థలాలకు తరలించే ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు.
Tags:Police clashes in the hospital

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *