Police close within 10 days

దిశ హత్య కేసు పోలీసులు పది రోజుల్లోనే క్లోజ్‌…

Date:06/12/2019

హైదరాబాదు ముచ్చట్లు:

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసును పోలీసులు కేవలం పది రోజుల్లోనే క్లోజ్‌ చేశారు. నవంబర్‌ 27న రాత్రి 10:30 గంటల సమయంలో దిశపై అత్యాచారం చేసి హత్య చేయగా..శుక్రవారం తెల్లవారుజామున ఉదయం 3 గంటల సమయంలో దిశ హత్య జరిగిన ప్రాంతంలో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా.. నలుగురు నిందితులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. పోలీసుల వద్ద ఉన్న ఆయుధాలను లాక్కునేందుకు నిందితులు యత్నించారు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేశారు.ఈ కేసును తెలంగాణ పోలీసులు 10 రోజుల్లోనే క్లోజ్‌ చేసి శభాష్‌ అనిపించుకున్నారు.దిశ హత్యకేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. షాద్‌నగర్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా నలుగురు నిందితులు పారిపోయారు. పారిపోతున్న నిందితులపై పోలీసులు కాల్పులు జరపడంతో నలుగురు నిందితులు మృతి చెందారు. గత నెల 27వ తేదీన వెటర్నరీ డాక్టర్‌పై అత్యాచారం చేసిన నిందితులు హత్య చేసి చటాన్‌పల్లి వద్ద బ్రిడ్జి కింద శవాన్ని కిరోసిన్ పోసి కాల్చి చంపారు. అదే ప్రదేశంలో పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ప్రదేశంలో చీకటిగా ఉన్న పరిస్థితులను అనుకూలంగా చేసుకున్న నిందితులు తమ బుద్దిని చూపించి పోలీసులపై దాడికి దిగారు.

 

 

 

 

 

 

 

 

తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. జైల్లో ఉన్నప్పుడు నిందితులను హై సెక్యూరిటీ మధ్య వేరువేరుగా ఉంచారు.రాత్రి 12గంటల ప్రాంతంలో చర్లపల్లి జైలు నుంచి బయటకు తీసుకువచ్చారు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. అర్ధరాత్రి 2 గంటలు దాటిన తర్వాత నలుగురు నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు నవీన్, శివ, చెన్న కేశవులను చర్లపల్లి జైలు నుంచి రహస్యంగా తరలించారు. తొలుత తొండపల్లి టోల్ సమీపంలోని ఘటనా స్థలికి తీసుకెళ్లారు. అక్కడ లారీ నిలిపిన ప్రదేశాన్ని పరిశీలించారు. దిశను ముందు చూసిందెవరు? అత్యాచారం చేయాలనే ఆలోచన ఎవరిది? తదితర వివరాలను సేకరించారు. తర్వాత  అత్యాచారం జరిగిన ప్రదేశానికి సమీపంలో నిందితులు పాతిపెట్టిన దిశ మొబైల్‌ను వారితోనే తీయించారు. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేయడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. కస్టడీకి తీసుకున్న రెండో రోజే నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు. అంతకు ముందు దిశ హత్య కేసు దర్యాప్తులో భాగంగా సైబరాబాద్‌ పోలీసులు కీలక ఆధారాల్ని సేకరించారు.

 

 

 

 

 

 

 

 

ఇందుకోసం నిపుణులతో కూడిన క్లూస్‌ బృందాన్ని రంగంలోకి దింపారు. నిందితులను అరెస్ట్‌ చేసిన సమయంలోనే పలు ఆధారాల్ని సేకరించినా.. కోర్టులో నిరూపించేందుకు అవసరమైన కీలక ఆధారాల్ని మలివిడతలో క్లూస్‌ నిపుణులు సేకరించారు.శంషాబాద్‌ తొండుపల్లి, షాద్‌నగర్‌ చటాన్‌పల్లిల్లోని సంఘటన స్థలాల్లో గురువారం క్షుణ్నంగా తనిఖీలు చేశారు. షాద్‌నగర్‌ డిపోలో ఉన్న లారీని మరోసారి పరిశీలించారు. అతిసూక్ష్మ వస్తువుల్ని సైతం గుర్తించగలిగే ‘సూపర్‌లైట్‌’ పరికరాన్ని వినియోగించి ఆధారాల్ని సేకరించారు. నిందితుల ఎన్‌కౌంటర్ తో ‘దిశ’కు ఆత్మశాంతి లభించిందని పలువురు మహిళా నేతలు వ్యాఖ్యానించారు. వాళ్లను ఉరితీస్తారనుకున్నాం, కానీ, ఎన్‌కౌంటరే మంచి నిర్ణయమని దిశా సోదరి  హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు ఇకనైనా పునరావృతం కాకుండా ఉంటాయని ఆమె వ్యాఖ్యానించారు.

 

 

 

 

 

 

 

 

తమ కుటుంబానికి అండగా నిలిచిన అందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.మరో వైపు దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతానికి భారీగా జనాలు తరలివస్తున్నారు. దీంతో కొత్తూరు వై జంక్షన్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ జామ్ కారణంగా.. పాత జాతీయ రహదారి వైపు వాహనాలను మళ్లిస్తున్నారు . చటానపల్లివంతెనపై నుంచి పోలీసులపై పూలు చల్లుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘ తెలంగాణ పోలీస్‌ జిందాబాద్‌.. సాహో సజ్జనార్‌’ అంటూ నినదించారు..  నవంబర్‌ 27న దిశపై నలుగురు నిందితులు అత్యంత దారుణంగా అత్యాచారం చేసి.. ఆ తర్వాత ఆమెపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. షాద్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని చటాన్‌పల్లి బ్రిడ్జి కింద దిశను నిందితులు హత్య చేశారు. నిందితుల ఎన్‌కౌంటర్‌.. దిశను హత్య చేసిన ప్రాంతానికి 300 మీటర్ల దూరంలో జరిగింది.

 

ఎన్ కౌంటర్ పై హర్షాతిరేఖాలు

 

Tags:Police close within 10 days

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *