పోలీసుల సంస్మరణ దినోత్సవం

Police Commemoration Day

Police Commemoration Day

Date:15/10/2019

పుంగనూరుముచ్చట్లు:

పోలీసుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్‌ఐ రవికుమార్‌ ఆధ్వర్యంలో మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో ఓపెన్‌హౌస్‌ విధానాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ సీఐ గంగిరెడ్డి ఆదేశాల మేరకు స్టేషన్‌లో విద్యార్థులకు స్టేషన్‌లో పరిపాలన విధానాలను వివరించామన్నారు. అలాగే తుపాకులు, లాఠీల వినియోగం , విధివిధాలను వివరించారు. పోలీసులు సంస్మరణ దినోత్సవాన్ని ఈనెల 14 నుంచి 20 వరకు జిల్లా వ్యాప్తంగా ఎస్పీ సెం•ల్‌ కుమార్‌ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నారన్నారు. ఇందులో భాగంగా పుంగనూరు పరిధిలో విద్యార్థులకు పోలీసుల సేవలు గూర్చి వ్యాసరచన పోటీలు, వకృత్వపు పోటీలు నిర్వహించి, విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరు పోలీసుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొని, ప్రజల కోసం ప్రాణాలు ఆర్పించిన వారి త్యాగాలను స్మరించుకుంటు వారికి నివాళులర్పించాలని కోరారు.

16 నుంచి గృహ నిర్మాణ లబ్ధిదారుల సమావేశం

Tags: Police Commemoration Day

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *