Natyam ad

కొలనుకొండలో పోలీసుల కార్డన్ సెర్చర్

తాడేపల్లి ముచ్చట్లు:

గుంటూరు జిల్లా తాడేపల్లి లో పోలీసులుకోడి పందేలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపధ్యంలో కొలనుకొండలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సంక్రాంతి పండుగ అందరూ ఆనందంగా కుటుంబ సభ్యులతో జరుపుకోవాలి. పేకాటలు, కోడిపందాలు నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పందెం కోళ్ళు పెంచే వారి పై కూడా నిఘా ఉంటుంది. ఇప్పటికే కొన్నిప్రత్యేక టీమ్ లతో నిఘా పెట్టాం. దశలవారీగా ప్రతి గ్రామంలో కార్డన్  సెర్చ్ ఉంటుంది. గంజాయి నిషేధిత గుట్కాలు బెల్ట్ షాపులపై ప్రత్యేక నిఘ వుంటుంది. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన ఇతరఏమైనా ఆసాంఘిక  కార్యక్రమాలు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  ఈ కార్డన్ సెర్చ్ లో సీఐ శేషగిరిరావు, ఎస్సైలు శ్రీనివాసరావు, నారాయణ, రమేష్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

 

Tags:Police cordon searcher in Kolanukonda

Post Midle
Post Midle