Natyam ad

కదిరి మర్డర్ మిస్టరీని ఛేదించిన పోలీసులు

అనంతపురం ముచ్చట్లు:
 
గత ఏడాది నవంబర్ 16న  కదిరిలో సంచలనం కలిగించిన టీచర్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కదిరి ఎన్జీవో కాలనీ లో   మర్డర్  ఫర్ గేయిన్ కేసులో పోలీసులు నిందితుడిని  అరెస్టు చేశారు.  హంతకుడు కదిరి పట్టణానికి చెందిన షేక్ షఫీ గా పోలీసులు గుర్తించారు.  గత ఏడాది నవంబర్ 16న టీ హోటల్ నిర్వాహకుడు రమణ ఇంటి లోకి ప్రవేశించిన  షఫీ, రమణ భార్య శివమ్మ పై రాడ్డుతో దాడి చేసి బంగారం, నగదు దోచుకున్నాడు. ఆదే సమయంలో పక్క ఇంటిలో ఉంటున్న  టీచర్ శంకర్ రెడ్డి వాకింగ్ వెళ్లాడాన్ని గమనించిన షఫీ,   శంకర్ రెడ్డి ఇంటిలోకి ప్రవేశించి ఆయన భార్య టీచర్ ఉషారాణిపై రాడ్డుతో దాడి చేసి  బంగారాన్ని దోచుకెళ్లాడు.   ఉషారాణి అక్కడికక్కడే మృతి చెందడంతో కేసు సంచలనంగా మారింది. దాంతో పోలీసు ఉన్నతాధికారులు 10 టీములు  ఏర్పాటు చేశారు. స్పెషల్ టీంలు  మూడు నెలల పాటు ఇతర రాష్ట్రాల్లో సైతం విచారణ చేపట్టారు.  సుమారు మూడు నెలల విచారణ అనంతరం పోలీసులు పురోగతి సాధించారు.  కదిరి పట్టణానికి చెందిన షేక్ షఫీ నిందితుండని పోలీస్ విచారణలో నిర్ధారణ అయింది.
 
Tags:Police crack Kadiri Murder Mystery