Natyam ad

మదనపల్లెలో 1500 మందితో పోలీస్ బందోబస్తు :ఎస్పీ కృష్ణారావు

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లెలో 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ కృష్ణారావు తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. మదనపల్లె జడ్పీ హైస్కూల్లో ఆయన మాట్లాడుతూ.. గ్రామ, పట్టణ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగంచుకునే విధంగా అన్ని రకాల భద్రత ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. NCC, NSS, పారామిలటరీ, స్త్రీకింగ్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, హోంగార్డులు, మాజీ సైనికులు, సిఐలు, ఎస్ఐలు, పోలీసులు మొత్తం 1500 మందితో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. డ్రోన్ కెమెరాలు, మొబైల్ స్ట్రైకింగ్ ఫోర్సు, వీడియో కబరేజీ పోలీస్ మొబైల్ వాహనాలు, మైక్రో అబ్జర్వర్లు వంటి వారితో బందోబస్తు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి ప్రసాద్ రెడ్డి, సిఐలు వల్లి భాష, యువరాజు, ఎన్ శేఖర్ తదితరులు ఉన్నారు.

 

Tags: Police deployment with 1500 people in Madanapalle: SP Krishna Rao