Natyam ad

బరులు ధ్వంసం చేస్తున్న పోలీసులు

కాకినాడ ముచ్చట్లు:
 
సంక్రాంతి పండుగలో కోడిపందాలు, పేకాట, గుండాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు జిల్లా పోలీసులు చెక్ పెడుతున్నారు. పటిష్టమైన వ్యూహం మరియు సమాచారంతో కోడిపందాల బరులను ధ్వంసం చేస్తున్నారు. “సంప్రదాయ సంక్రాంతి” నిర్వహణలో భాగంగా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పోలీసు సిబ్బంది యువత మరియు ప్రజలు సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందాలు, పేకాట, గుండాట వంటి అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండేందుకు “సంప్రదాయ సంక్రాంతి” క్రీడా పోటీలను నిర్వహిస్తుండటం అందరికీ తెలిసినదే. ఒక వైపు సంప్రదాయ క్రీడా పోటీలను నిర్వహిస్తూనే చట్ట వ్యతిరేక కోడిపందాల నిర్వహణను నిలువరించడానికి ఉన్నతాధికారులు  జారీ చేసిన ఆదేశాల మేరకు  స్థానిక పోలీసు అధికారులు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీసు అధికారుల సహకారంతో కోడిపందాలు నిర్వహించే బరులను గుర్తించే పనిలో నిమగ్నమైనారు. దీనిలో భాగంగా ఎప్పటికప్పుడు రెవిన్యూ అధికారుల సమన్వయంతో సిద్ధం చేసిన బరులను గుర్తించి ధ్వంసం చేస్తూ యజమానులకు ముందస్తు నోటీసులు ఇచ్చి చట్టపరంగా ఉత్పన్నమయ్యే పరిణామాలు తెలియజేస్తూ ఏ మాత్రం ఉపేక్షించేది లేదనే గట్టి సంకేతాలీస్తున్నారు. ఇప్పటికే అమలాపురం, రామచంద్రాపురం, పెద్దాపురం సబ్ డివిజన్లు, ఏజెన్సీ ప్రాంతాలలో మరియు ఇతర ప్రాంతాలలో కోడిపందాల నిర్వహణ, బరుల ఏర్పాటుపై పక్కా సమాచారం సేకరించి రెవిన్యూ మరియు పోలీసు అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి గత రెండు రోజుల నుండి బరులను ధ్వంసం చేస్తున్నారు. కోడిపందాల నిర్వహణకు ఎటువంటి అధికారిక, అనధికారిక అనుమతులు లేవని, అటువంటి ప్రచారాలు, వదంతులను తిప్పికొట్టేల స్థానిక పోలీసు అధికారులు మరియు సిబ్బంది క్షేత్ర స్థాయిలో సంక్రాంతి పండుగ ముగిసేవరకు ఏవిధమైన అసాంఘీక కార్యకలాపాలు జరగకుండా చూసేలా గట్టి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసారు. ఎవరైనా కోడిపందాల నిర్వహణకు పాల్పడినా, నిర్వాహకులకు, బరులను సిద్ధం చేస్తున్న వారికి సహకరించినా చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Police destroying burdens