పోలీసులు కొవ్వుత్తుల ర్యాలీ

Police fattening rally

Police fattening rally

Date:20/10/2019

పుంగనూరు ముచ్చట్లు:

పోలీసుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రూరల్‌ సీఐ మదుసూదనరెడ్డి, ఎస్‌ఐ రవికుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆదివారం రాత్రి పుంగనూరు పోలీసులు పట్టణంలో కొవ్వుత్తులు పట్టుకుని పురవీధుల్లో ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పోలీసులు సంస్మరణ దినోత్సవాలను ఈనెల 14 నుంచి 20 వరకు జిల్లా వ్యాప్తంగా ఎస్పీ సెం•ల్‌ కుమార్‌ ఆదేశాల మేరకు నిర్వహించామన్నారు. ప్రతి ఒక్కరు పోలీసుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొని, ప్రజల కోసం ప్రాణాలు ఆర్పించిన వారి త్యాగాలను స్మరించుకుంటు వారికి నివాళులర్పించడమే సంస్మరణ దినోత్సవం అన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రాణాలు కోల్పోయిన పోలీసుల సేవలను కొనియాడారు. దీనిని పురస్కరించుకుని పుంగనూరు పరిధిలో విద్యార్థులకు పోలీసుల సేవలు గూర్చి వ్యాసరచన పోటీలు, వకృత్వపు పోటీలు నిర్వహించామన్నారు. అలాగే ఓపెన్‌హౌస్‌ పై విద్యార్థులకు , తుపాకులు వినియోగంపై చైతన్య సదస్సులు నిర్వహించామన్నారు. ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశామన్నారు.

మంత్రి పెద్దిరెడ్డికి సమస్యలు విన్నవించిన మహిళలు

Tags: Police fattening rally

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *