మద్యం ముఠాతో పోలీసులు చేతులు

Date:10/08/2020

నల్గొండ ముచ్చట్లు:

ఏపీ ప్రభుత్వ మద్యపాన నిషేధం దిశగా అడుగులేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే బెల్ట్ షాపులను పూర్తిగా తొలగించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వైన్స్ షాపులను నడుపుతున్నారు. క్రమంగా మద్యం దుకాణాలను తగ్గిస్తూ.. పూర్తిగా మద్యపానాన్ని నిషేధించాలనేది జగన్ సర్కారు ఆలోచన. కానీ మందుబాబులు మాత్రం మద్యం దొరక్కపోతే శానిటైజర్ కొని ప్రాణాల మీదకైనా తెచ్చుకుంటున్నారు కానీ తాగుడు అలవాటును మానడం లేదు.ఏపీ, తెలంగాణ మధ్య సుదీర్ఘ సరిహద్దు ఉండటంతో.. సరిహద్దు గ్రామాల ప్రజలు రోజూ బోర్డర్ దాటొచ్చి తెలంగాణ పల్లెల్లో లిక్కర్ తాగుతున్నారు. ఇక్కడితో ఆగిపోలేదు. మందు బాబు ‘అవసరాల’ను క్యాష్ చేసుకోవడం కోసం కొందరు తెలంగాణ నుంచి గుట్టు చప్పుడు కాకుండా మద్యం తరలిస్తున్నారు. పాత ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి అక్రమంగా తెలంగాణ మద్యాన్ని ఏపీలోకి తీసుకెళ్తున్నారు.ఏపీలో ఇప్పటికే భారీ ఎత్తున అక్రమ మద్యం పట్టుబడింది. కానీ సూర్యాపేట, నల్గొండ జిల్లాల నుంచి కృష్ణా నది మీదుగానూ మద్యం తరలిస్తున్నారు. కాదేదీ అనర్హం అన్న రీతిలో మద్యం అక్రమ రవాణా చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం పోలీసు స్టేషన్‌లో పని చేసే ఇద్దరు కానిస్టేబుళ్లు ఏపీకి అక్రమంగా మద్యం రవాణా చేసే ముఠాతో చేతులు కలిపారు. ఈ విషయాన్ని పసిగట్టిన ఆంధ్రా పోలీసులు తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్రమాలకు పాల్పడిన ఇద్దరు కానిస్టేబుళ్లను ఎస్పీ భాస్కరన్ సస్పెండ్ చేశారు.

రామోజీకి సుప్రింకోర్టు నోటీస్

Tags:Police hands over alcohol gang

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *