పోలీస్ హెడ్ క్వార్టర్స్ తుక్కు వస్తువులు వేలం

పెద్దపల్లి ముచ్చట్లు:

 

 

రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ ఆదేశాల మేరకు రామగుండం కమిషనరేట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ (సాయుధ పోలీస్ దళం) ఆవరణలో డ్యామేజ్ అయిన జనరేటర్లు, పాత కుర్చీలు, పాత టెంట్లు, పాత టేబులు, ఇతర పాత ఇనుప సామాన్లు, విప్రో కంప్యూటర్, డ్రాగన్ లైట్స్, పాత హెల్మెట్లు, వివిధ రకాలైన డ్యామేజ్ అయిన ఇతర వస్తువులు మంగళవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ ఆవరణలో   అడిషనల్ డీసీపీ ఏఆర్ కమాండెంట్ గారి ఆధ్వర్యంలో బహిరంగ వేలం నిర్వహించడం జరిగింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రెండు జిల్లాలకు చెందిన ఆసక్తి కలిగిన కొంతమంది బహిరంగ వేలం లో పాల్గొన్నారు. ఈ పాత బహిరంగ వేలం ద్వారా 56,000 రూపాయల ఆదాయం రావడం జరిగింది. దీనిని పోలీస్ శాఖ సంబందించిన ప్రభుత్వం ఖాతా లో జమ చేయడం జరుగుతుంది అని అడిషనల్ డీసీపీ ఏఆర్ కమాండెంట్ సంజీవ్ ఒక ప్రకటన లో తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ సంజీవ్,ఏసీపీ ఏఆర్ సుందర్రావు, మల్లికార్జున్, సీపీఓ నాగమణి, సీపీ సీసీ తిరుపతి, ఆర్ఐ లు మధుకర్,శ్రీధర్,విష్ణు ప్రసాద్,అంజన్న ఆర్ఎస్ఐ ప్రవీణ్ పాల్గొన్నారు.

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

Tags:Police Headquarters Auction Rust Items

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *