బండి సంజయ్ ను అడ్డుకున్న పోలీసులు
కామారెడ్డి ముచ్చట్లు:
కామారెడ్డి జిల్లా బికనూర్ వద్ద బండి సంజయ్ కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ నాయకుల వాహనాలను ముందుకు వెళ్లకుండా వలయంగా నిలబడడంతో కాన్వాయి ఆగిపోయింది. బండి సంజయ్ ను అడ్డుకోవడంపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులను లాక్కేళ్లారు. దాంతో బీజేపీ నేతలు జాతీయ రహదారిపై బైటాయించారు. ఇదేమి రాజ్యం… ఇదేమి రాజ్యం…దొంగల రాజ్యం… దోపిడీ రాజ్యం..అంటూ నినాదాలు చేసారు. పోలీసుల తీరుపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకె ట్రిపుల్ ఐటీకి వెళుతున్నానని బండి సంజయ్ చెప్పారు. విద్యార్థుల ఆందోళన చేస్తుంటే కరెంట్, నీళ్లు కట్ చేయడమేంటి? వాళ్లేమైన తీవ్రవాదుల? విద్యార్థులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాల్సిన సీఎం సిల్లీ సమస్యలంటూ రెచ్చగొడతారా? అని అయన ప్రశ్నించారు. సీఎంవిద్యార్థులతో మాట్లాడితే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. సమస్యలు తెలుసుకోవాలని వెళితే అడ్డుకుంటారా ? ట్రిపుల్ ఐటీలో చదువుకునే వాళ్లంతా పేద విద్యార్థులే… వాళ్లకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరడం తప్పా? విద్యార్థుల సమస్యలు పరిష్కరించేంతవరకు పోరాడతామని అయన అన్నారు.
Tags:Police intercepted Bandi Sanjay

