రేవంత్ రెడ్డి ని అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్ ముచ్చట్లు:


సికింద్రాబద్ లో రాకేష్ ను  చంపింది టిఆర్ఎస్ ..చంపించింది బీజేపీ. రాకేష్ కుటుంబాన్ని పరామర్శిస్తే, రాకేష్ భౌతిక కాయానికి నివాళులు అరిస్తే వరంగల్ వెళ్తే పోలీసులకు వచ్చే ఇబ్బంది ఎంటని టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. టిఆర్ఎస్  మంత్రులు రాకేష్ శవయాత్ర చేయొచ్చు .. గులాబీ జెండాలు కట్టుకొని యాత్రలో పాల్గొనవచ్చు. మేము వెళ్ళడానికి కూడా ఇన్ని అడ్డంకులా ? చావులను కూడా టిఆర్ఎస్ రాజకీయంగా వాడుకోవాలని చూస్తుంది. ప్రజలను ఎక్కువ కాలం మోసం చేయలేరు. త్వరలో సిరిసిల్లలో నిరుద్యోగ డిక్లేరేషన్ ప్రకటిస్తాం. ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలి. ఇది నా పార్లమెంట్ నియోజక వర్గం. అక్కడ కుటుంబాన్ని పరామర్శించాలని వెళ్తున్నా. రాజకీయాల కోసం కాదు.. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పండని అన్నారు.

 

Tags: Police intercepted Rewanth Reddy